Ap Three Capitals : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ..!
Ap Three Capitals ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లు Ap Three Capitals ను ఉపసంహారించుకున్నట్లు ప్రకరించింది.ఈ విషయాన్ని త్రిసభ్‌య ధర్మాసనానికి అడ్డకేట్ జనరల్ కూడా తెలియజేశారు. ఏపీ కేబినెట్ లో కూడా వికేంద్రీకరణ, సీఅర్డీఏ రద్దు బిల్లులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
మరి కాసేపట్లో సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించే అవకాశం ఉంది. కాగా. కొద్దిసేపటి క్రితమే వరద సహాయక చర్యలపై సీఎం జగన్ సంబందిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే వరద ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టారు.

ap govt withdraws on AP three captials Bill
ఆ ప్రాంతాలకు నిత్యావసర వస్తువుల పంపిణీకి అధికారులకుఆదేశాలు జారీ చేశారు. జిల్లాకో సీనియర్ అధికారిని నియమించి పరిస్థితులను సమీక్షిస్తున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు సహాయక చర్యల్లో ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు.