Krishnapatnam Anandayya : ఆనందయ్య మందుపై హైకోర్టు సంచలన కామెంట్స్.. రాష్ట్ర సర్కార్ కు ఆదేశాలు
Krishnapatnam Anandayya : కృష్ణపట్నం ఆనందయ్య గురించి అందరికీ తెలిసేంద. ఆయన కరోనాకు ఆయుర్వేద మందు కనిపెట్టి పాపులర్ అయ్యారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఆయన పేరు మారు మోగిపోతోంది. ఏది ఏమైనా.. ఇప్పటి వరకు ఆయన వేల మందికి కరోనా మందును ఇచ్చారని.. దాని వల్ల ఎవ్వరికీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాలేదు. కరోనా కూడా నయం అయిందని చెబుతున్నారు. అయితే.. ఈ మందుపై విచారణ జరిపిన ఆయుష్ కమిటీ.. ఈ మందును ఆయుర్వేద మందుగా గుర్తించలేమని.. ఇది కేవలం నాటు మందు మాత్రమేనని స్పష్టం చేసింది. అయితే.. ఆనందయ్య మందుపై ఇంకా టెస్టులు జరుగుతుండటంతో ప్రస్తుతానికి ఆ మందు పంపిణీని నిలిపివేశారు.
అయితే.. ఆనందయ్య మందును ప్రభుత్వం గుర్తించి.. దాని పంపిణీకి అనుమతి ఇవ్వాలని.. ఆనందయ్య తరుపు న్యాయవాది అశ్వని కుమార్ కోర్టులో వాదనలు వినిపించారు. ఈసందర్భంగా కోర్టు కీలక సూచనలు చేసింది. అసలు.. ఆయుర్వేద కౌన్సిల్ లో ఆనందయ్య రిజస్టర్ చేసుకోలేదని.. అందుకే ప్రస్తుతానికి ఆనందయ్య మందు పంపిణీని నిలిపివేసినట్టు ప్రభుత్వం తరుపు లాయర్ కోర్టుకు విన్నవించారు. ఇంకా ఆనందయ్య మందు టెస్టుకు సంబంధించిన ఫలితాలు రాలేదని.. ఈనెల 29న ల్యాబ్ రిపోర్ట్స్ వస్తాయని ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది.
Krishnapatnam Anandayya : ఆనందయ్య మందుపై కౌంటర్ దాఖలు చేయండి
అయితే.. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. ఆనందయ్య మందుకు సంబంధించిన పూర్తి నివేదిక కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించడంతో పాటు.. కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఆనందయ్య పిటిషన్ కు సంబంధించిన తదుపరి విచారణను వచ్చే సోమవారానికి కోర్టు వాయిదా వేసింది.