ఆనందయ్య ను జగన్ ఏమి చేయలేడు.. చాలానే బ్యాక్ గ్రౌండ్ ఉంది.. సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ఆనందయ్య ను జగన్ ఏమి చేయలేడు.. చాలానే బ్యాక్ గ్రౌండ్ ఉంది.. సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు

 Authored By brahma | The Telugu News | Updated on :26 May 2021,10:34 am

ఇప్పుడు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన నెల్లూరు ఆనందయ్య పేరు మార్మోగిపోతోంది. మహమ్మారి కరోనా కు తనదైన రీతిలో మందు కనిపెట్టాడంటూ నేషనల్ మీడియా లో హైలైట్ అవుతున్నాడు, ఇక మన తెలుగు మీడియా అయితే గత నాలుగైదు రోజుల నుండి అనుక్షణం ఆనందయ్య పేరును కలవరిస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో సిపిఐ నేత నారాయణ ఆనందయ్య మందుపై కీలక వ్యాఖ్యలు చేయటమే కాకుండా, ఆనందయ్య కు చాలానే పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందంటూ బాంబు పేల్చే ప్రయత్నం చేశాడు.

CPI Narayana Andhra politics | No religious politics to AP - Telugu Front

నారాయణ మాట్లాడుతూ మూడు రోజులు పాటు ఆనందయ్య ను పోలీసులు తీసుకోని వెళ్లారు. దీనితో ఆనందయ్య ను కిడ్నప్ చేశారని అన్నారు. కానీ అందులో నిజం లేదు. ఆయుష్ వాళ్ళు ముందు తన మందును తయారు చేయటానికి ఆనందయ్య వెళ్ళాడు.. ఈ క్రమంలో నేను ఆనందయ్య ను వెళ్లి కలిసి రావటం జరిగింది. ఆయనకు ఏమి ఇబ్బంది లేదు. బాగానే ఉన్నాడు. ఆనందయ్య ను టచ్ చేయటం అంత ఈజీ కాదు. సీఎం జగన్ కూడా ఆయన్ని ఏమి చేయలేడు. అతనికి చాలా పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఆయన ఎదో మందు ఇస్తున్నప్పుడు దానిని అలాగే కొనసాగిస్తే మంచింది. ఇలాంటి సమయంలో గుడ్డి కన్నా మెల్ల నయం కదా..! జనాలు కూడా నమ్ముతున్నారు కాబట్టి ఆనందయ్య మందును పంచి పెట్టాలి అంటూ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఆనందయ్య మందుపై నారాయణ మాట్లాడటం తప్పేమి కాదు కానీ, ఆయన బ్యాక్ గ్రౌండ్ చాలానే ఉంది. సీఎం జగన్ కూడా ఆయన్ని ఏమి చేయలేడు అంటూ మాట్లాడటం వెనుక రహస్యం ఏమిటో ఎవరికీ అర్ధం కానీ విషయం. ఆనందయ్య మందు మీడియా లో హైలైట్ అయిన వెంటనే ఆయన్ని కలిసి సహాయం అందించింది వైసీపీ ఎమ్మెల్యే కాకాని. దీనిని బట్టి చూస్తే ఆనందయ్య కు వైసీపీ సపోర్ట్ ఉందని తెలుస్తుంది. అలాంటప్పుడు సీఎం జగన్ కూడా ఆనందయ్య ను ఏమి చేయలేదని నారాయణ ఎందుకు అన్నట్లు.. ఎదో మాట వరసకు అన్నాడా..? లేక ఏమైనా మర్మం ఉందా అంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది