AP Minister Ambati Rambabu : సినిమాలో వైసీపీ మంత్రి.. వైరల్ అవుతున్న ఫోటోలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP Minister Ambati Rambabu : సినిమాలో వైసీపీ మంత్రి.. వైరల్ అవుతున్న ఫోటోలు…!

 Authored By jagadesh | The Telugu News | Updated on :4 October 2022,9:30 pm

AP Minister Ambati Rambabu : చాలా మంది సినిమా నటులు రాజకీయాల్లోకి వచ్చిన ఎన్నో ఘటనలను చూశాం. ఏదో ఊరికే అలా రాజకీయాల్లోకి రావడం కాదు.. ఏకంగా ముఖ్యమంత్రులు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ పలువురు సినిమా తారలు రాజకీయాల్లోకి రావడం, రాజకీయాల్లో రాణించడం చూస్తున్నాం. అంటే.. సినిమా ఇండస్ట్రీకి, రాజకీయాలకు ఏదో అనుబంధం ఉన్నట్టుంది. అందుకే సినిమా వాళ్లు ఎక్కువగా రాజకీయాల వైపు మొగ్గు చూపిస్తుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే పలువురు సినిమాలో నటించే నటులు, రాజకీయాల్లోకి కూడా వచ్చారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అయ్యారు. ప్రస్తుతం ఉన్న ఏపీలో మంత్రివర్గంలోనూ సినిమాల్లో నటించిన వాళ్లు ఉన్నారు. ఎన్ని సినిమాల్లో నటించినా రాని గుర్తింపు మాత్రం వాళ్లకు కేవలం రాజకీయాల ద్వారా వచ్చింది అంటే నమ్ముతారా? ప్రస్తుతం ఏపీలో మంత్రిగా కొనసాగుతున్న అంబటి రాంబాబు కూడా సినిమా నటుడే అని ఎంత మందికి తెలుసు. ఆయన సినిమాల్లో నటించారు అంటే నమ్ముతారా? ప్రతిపక్ష పార్టీలకు ఏమాత్రం నిద్రపట్టకుండా చేసి, వాళ్లు ఒకటంటే రెండు అంటూ.. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో దూసుకుపోయే అంబటి రాంబాబు సినిమాల్లో కూడా నటించారట. అయితే.. ఇప్పుడు కాదు. అయితే.. ఆయన నటించిన సినిమా ఏంటి? అనేది మాత్రం తెలియదు కానీ..

AP Minister Ambati Rambabu acted in movies

AP Minister Ambati Rambabu acted in movies

AP Minister Ambati Rambabu : అంబటి రాంబాబు నటించిన సినిమా ఫోటోలు వైరల్

ఓ అందమైన యువతి పక్కన నిలబడి ఉన్న పలు ఫోటోలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడో 30 ఏళ్ల కింద అంబటి రాంబాబు సినిమాల్లో నటించాడట. అప్పుడు ఆయన రాజకీయాల్లో లేరు. ప్రస్తుతం ఆయన ఏపీ మంత్రి కావడంతో ఆయనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎలాగూ సినిమా నటులు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి.. అంబటి కూడా అప్పట్లో సినిమాల్లో నటించారని ఇప్పుడు అర్థం అవుతోంది. ఆ ఫోటోలను చూసి ఏపీ ప్రజలు అంబటి రాంబాబు సినిమాల్లోనూ నటించారా? అని ముక్కున వేలేసుకుంటున్నారు.

Also read

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి