Chintakayala Vijay : చింతకాయల విజయ్ ఎంత వెధవో ఈ ఒక్క సంఘటనతో తేలిపోతుంది
Chintakayala Vijay : ఒకప్పుడు పలు పార్టీల నేతలు ఒకరిని మరొకరు డైరెక్ట్ గా తిట్టుకునేవారు. నిందించుకునేవారు. కానీ.. ఇప్పుడు ఏదైనా సోషల్ మీడియాలోనే. సోషల్ మీడియాలోనే వార్ నడిచేది. ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీ వైసీపీ, టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. రెండు పార్టీలలోని నేతలు.. ఆయా పార్టీల నాయకులను కాకుండా వాళ్ల కుటుంబ సభ్యులను కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయాలు వేడి రాజుకున్నాయి.ఏ రాజకీయ నాయకుడైనా మరో రాజకీయ నాయకుడిపై విమర్శలు చేస్తే అది రాజకీయం అవుతుంది. కానీ.. ఒక రాజకీయ నాయకుడి కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి.. ఏకంగా సోషల్ మీడియాలో విమర్శలు చేయడం, అభ్యంతరకర పోస్టులు పెట్టడం దేనికి నిదర్శనం.
తాజాగా సీఎం జగన్ భార్య వైఎస్ భారతిపై చింతకాయల అయ్యన్నపాత్రుడి కొడుకు విజయ్ అభ్యంతరకర పోస్టు పెట్టాడని ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.తాజాగా హైదరాబాద్ లో విజయ్ ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు ఆ పోస్టుపై ఆరా తీశారు. ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ విషయం మీడియాలో రావడంతో మంత్రి మేరుగ నాగార్జున.. చింతకాయల విజయ్ పై మండిపడ్డారు. చింతకాయల విజయ్.. సోషల్ మీడియా అరాచక వాది అంటూ అభివర్ణించారు. ఇలాంటి అభ్యంతరకర పోస్టులు పెట్టిన వాళ్లపై పోలీసులు విచారణ చేస్తే తప్పా? అంటూ నాగార్జున ప్రశ్నించారు.
Chintakayala Vijay : విజయ్ ఇంటి వద్ద సీఐడీ అధికారుల హల్ చల్
సీఐడీ అధికారులు విజయ్ కి నోటీసులు జారీ చేస్తే తప్పా అని ప్రశ్నించారు. విజయ్ ఒక దొంగ, ఏపీలో టీడీపీ నేతలు తమకు రాజ్యాంగం వర్తించదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక మహిళపై అభ్యంతరకర పోస్టు పెడితే మీరు సమర్థిస్తారా? మహిళల మాన, ప్రాణాల గురించి విజయ్.. అభ్యంతరకర పోస్టులు పెట్టాడు. ఇలాంటి వాళ్లకు ఏకంగా చంద్రబాబు, లోకేశ్ సమర్థిస్తున్నారు. వీళ్లంతా కలిసి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో. విజయ్ కంటే ఎక్కువే మేము మాట్లాడగలం.. తిట్టగలం కానీ.. మకు సంస్కారం అడ్డొస్తుంది. కాబట్టి మేము ఊరుకుంటాం. కానీ.. టీపీ నేతలకు సిగ్గు అనేదే లేదు.. అంటూ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు.