YS Jagan : జగన్ కి అతిపెద్ద పరీక్ష
YS Jagan : అధికార పార్టీ వైసీపీకి ప్రస్తుతం ఎమ్మెల్సీ టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే ఇంకో 18 నెలల్లో ఏపీలో సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. ఈనేపథ్యంలో త్వరలో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీపై తీవ్ర ప్రభావం చూపించనున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కొత్త ఓటర్లకు కూడా నమోదుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్లు అందరూ తమ ఓటును నమోదు చేసుకోవాలి. ఓటర్ల నమోదు ప్రక్రియపై టీడీపీ, వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఎందుకంటే.. ప్రస్తుతం ఏపీలో ఇవే రెండు ప్రధాన పార్టీలు.
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈనేపథ్యంలో వైసీపీ ముందే తమ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించింది. పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిని వైసీపీ తాజాగా ప్రకటించింది. ఇక.. ఆయన గెలుపును వైపీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కావడం, కొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు రావడంతో ఈ ఎన్నికను సీఎం జగన్ చాలెంజ్ గా తీసుకున్నారు.ఏపీలో చాలా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. కానీ.. అవి కేవలం ఒక సెక్టార్ ప్రజలకే అందుతున్నాయని, నిరుద్యోగుల గురించి,
YS Jagan : తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో వైసీపీ సమీక్ష
ఉద్యోగాల ప్రకటనల గురించి వైసీపీ ప్రభుత్వం ఆలోచించడం లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలా చేజిక్కించుకుంటుందో వేచి చూడాలి. చాలామంది నిరుద్యోగులు ఈ విషయంలో కాస్త అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుండటంతో ఈ ఎన్నికల్లో వైసీపీ ఎలా గెలుస్తుంది అనేది చాలెంజింగ్ గానే ఉంటుంది. అందుకే.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని, తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో వైసీపీ నేతలు సమావేశం అయ్యారు. కొత్త ఓటర్ల చేర్పులు మార్పులు, పార్టీ నేతల మధ్య సమన్వయం విషయంపై పార్టీ నేతలతో మంత్రి పెద్దిరెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికలు మాత్రం అధికార వైసీపీకి అతి పెద్ద పరీక్ష అనే చెప్పుకోవాలి. అయితే.. సీఎం జగన్ చేపట్టిన పలు సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తాయో లేదో వేచి చూడాల్సిందే.