BJP : బీజేపీకి పర్ఫెక్ట్ సమాధానం – ఇలాగే ఉండాలి తగ్గేదే లేదు ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

BJP : బీజేపీకి పర్ఫెక్ట్ సమాధానం – ఇలాగే ఉండాలి తగ్గేదే లేదు !

 Authored By kranthi | The Telugu News | Updated on :16 June 2023,5:00 pm

BJP : ఏపీకి కేంద్రం చాలా చేసింది. వేల కోట్లు ఇచ్చాం.. పోలవరానికి నిధులు ఇచ్చాం.. రెవెన్యూ నిధులు.. ఇచ్చాం.. అవి ఇచ్చాం.. అంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ డప్పాలు కొడుతున్న విషయం తెలిసిందే. అసలు.. ఏపీలో వరుస పర్యటనలు చేస్తూ బీజేపీ రచ్చ రచ్చ చేస్తున్న విషయం తెలుసు కదా. శ్రీకాళహస్తి సభలో అవే మాటలు, వైజాగ్ సభలోనూ అవే విమర్శలు. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై వైసీపీ నేతలు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

దేశంలో ఉన్న మిగితా రాష్ట్రాలకు ఏం ఇవ్వడం లేదా? కేవలం ఏపీకే ప్రత్యేకంగా నిధులు ఇస్తున్నారా? ఏపీకి మీరేమైనా ప్రత్యేకంగా నిధులు ఇచ్చారా? పెండింగ్ లో ఉన్న నిధులేగా ఇచ్చింది. వేరే రాష్ట్రాలకు ఏం ఇవ్వడం లేదా? మరి.. మిగిలిన రాష్ట్రాలకు ఏం ఇస్తున్నారో.. అలాగే ఏపీకి కూడా ఇస్తూ.. ప్రత్యేకంగా ప్రేమ చూపించినట్టుగా ఎందుకు ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు అంటూ వైసీపీ నేతలు బీజేపీకి కౌంటర్ ఇస్తున్నారు.

ap minister gudivada amarnath fires on bjp

ap minister gudivada amarnath fires on bjp

BJP : బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చిన ఏపీ మంత్రి అమర్నాథ్

ఏపీలో మీరు ఇచ్చే రేషన్ బియ్యం ఎంతమందికి. ఏపీలో మీరు ఇచ్చిన నిధులతో వచ్చే రేషన్ బియ్యానికి జగన్ ఫోటో పెట్టుకున్నారు అంటూ తెగ హడావుడి చేస్తున్నారు కదా. ఏపీలో ఎంతమందికి మీరు ఉచిత బియ్యం ఇస్తున్నారు. కోటిన్నర మందికి ఏపీలో ఉచిత బియ్యం ఇస్తే.. అందులో కేంద్రం ఇచ్చే బియ్యం ఎంత? 90 లక్షల మందికే ఇస్తున్నారు. మిగితా 60 లక్షల మంది పరిస్థితి ఏంటి. వాళ్లకు ఉచిత బియ్యం ఇచ్చేది ఏపీ ప్రభుత్వం.. అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ బీజేపీకి సరైన కౌంటర్ ఇచ్చారు. కేంద్రం ఇచ్చేది పావలా అయితే రూపాయి అంత హడావుడి చేస్తోందని.. కేంద్రం గోరంత ఇచ్చి కొండంత ప్రచారం చేస్తోందని మంత్రి విమర్శించారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది