Kodali Nani : చంద్రబాబు జన్మలో ఇక సీఎం కాలేడు : మంత్రి కొడాలి నాని | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kodali Nani : చంద్రబాబు జన్మలో ఇక సీఎం కాలేడు : మంత్రి కొడాలి నాని

Kodali Nani : టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇక జన్మలో సీఎం కాలేడని రాష్ట్ర మంత్రి కొడాలి నాని అన్నారు. సీఎం జగన్ పై కావాలని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మంత్రి మండిపడ్డారు. ఎల్లో మీడియా ప్రతి రోజూ ఏదో ఒక తప్పుడు కథనాన్ని రాయడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. సీఎం జగన్ పై కావాలని బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. వెంటనే చంద్రబాబు సీఎం కావాలనేదే ఎల్లో మీడియా తాపత్రయం. ఆయనను ముఖ్యమంత్రిని […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :25 February 2022,7:00 am

Kodali Nani : టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇక జన్మలో సీఎం కాలేడని రాష్ట్ర మంత్రి కొడాలి నాని అన్నారు. సీఎం జగన్ పై కావాలని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మంత్రి మండిపడ్డారు. ఎల్లో మీడియా ప్రతి రోజూ ఏదో ఒక తప్పుడు కథనాన్ని రాయడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. సీఎం జగన్ పై కావాలని బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు.

వెంటనే చంద్రబాబు సీఎం కావాలనేదే ఎల్లో మీడియా తాపత్రయం. ఆయనను ముఖ్యమంత్రిని చేసేదాకా వాళ్లను నిద్రపట్టేలా లేదు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం వాళ్ల వల్ల కాదు. జన్మలో చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడు. ఇక అది జరగని పని.. అని కొడాలి నాని స్పష్టం చేశారు.కాకినాడ పోర్టు నుంచి చాలా ధాన్యం ఎగుమతి అవుతోంది. అందుకే.. ఏపీలో కాకినాడ పోర్టు.. ధాన్యం ఎగుమతిలో మొదటి స్థానంలో ఉంది. రైతుల పంటకు సంబంధించిన అన్ని వివరాలు క్రాప్ యాప్ లో ఉంటాయి.

ap minister kodali nani fires on chandra babu naidu

ap minister kodali nani fires on chandra babu naidu

Kodali Nani : సన్నబియ్యం ఎగుమతిలో ఎటువంటి అవినీతి జరగలేదు

అంతా అన్ లైన్ అయింది. ఎటువంటి అవినీతి లేదు. మరి.. ఎల్లో మీడియా ఇలాంటి తప్పుడు కథనాలను ఎందుకు రాస్తున్నట్టు. కావాలని సీఎం జగన్ పై దుష్ప్రచారం చేయడం కోసమా? పేదల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం జగన్ పై ఇన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారా? జగన్ ను బ్యాడ్ చేయాలనుకుంటే.. మిమ్మల్ని ఏపీ ప్రజలు బుద్ధి చెబుతారు. 2024లో మరోసారి ఓటుతో మీకు బుద్ధి చెప్తారు.. అంటూ కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది