Minister Mekapati Gautam Reddy : బ్రేకింగ్.. ఏపీ మంత్రి మృతి…!
Minister Mekapati Gautam Reddy : ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కాసేపటి క్రితం గుండెపోటు తో కన్ను మూశారు. నిన్నే దుబాయి నుంచి తిరిగి వచ్చిన మంత్రికి నేడు ఉదయం గుండెపోటు వచ్చింది.
2014 లో ఆత్మకూరు నుంచి పోటీ చేసిన మేకపాటి గౌతం రెడ్డి 1971 నవంబర్ 2 న జన్మించారు, ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి ఆయన ఎమ్మెస్సీ పూర్తి చేసారు.రెండు సార్లు ఆత్మకూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీ గా సేవలు అందించారు.

Ap Minister Mekapati Gautam Reddy died
నెల్లూరు జిల్లాలో మేకపాటి కుటుంబానిది బలమైన రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం. యువ మంత్రిగా ఆయన ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. సిఎం జగన్ తో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 49 ఏళ్ళ గౌతం రెడ్డి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసారు.
Advertisement
WhatsApp Group
Join Now