Home » Andhra Pradesh » Ap Minister Roja Counter To Mega Brother Nagababu
andhra pradesh

Nagababu – Roja : నాగబాబు vs రోజా — ఈ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్…!!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: January 8, 2023, 6:00 pm
Advertisement

Nagababu – Roja : ఈ మధ్య రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు.. సోషల్ మీడియాలోనే యుద్ధం ప్రకటిస్తున్నారు. ఎవరిని విమర్శించాలన్నా సోషల్ మీడియాలోనే. తాజాగా మెగా బ్రదర్ నాగబాబును ఏపీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా విమర్శించారు. అసలు.. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ట్విట్టర్ వార్ అది. ప్రస్తుతం వీళ్ల వార్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఒక మంత్రి అని కూడా చూడకుండా.. రోజాను పేరు పెట్టి నాగబాబు పిలిచారని..

Advertisement

ఎలాంటి గౌరవం లేకుండా మాట్లాడటం ఏంటంటూ రోజా ఫైర్ అయ్యారు. నాగబాబు రోజాపై చేసిన కామెంట్స్ కు దీటుగా ఆమె ట్విట్టర్ లో సమాధానం చెప్పారు. మంత్రి అయితే ఉండి.. తన మంత్రిత్వ శాఖను మున్సిపాలిటీ కుప్పతొట్టితో నాగబాబు పోల్చారు. రోజాను నాగబాబు అలా పోల్చడంతో రోజా పాత వీడియోలను ట్విట్టర్ లో షేర్ చేసింది. ఏపీ గురించి మీకు తెలిసిన విషయాలు శూన్యం అంటూ ఆమె ట్వీట్ చేశారు. విమర్శ చేయాలనుకుంటే.. విషయం ఉంటేనే చేయాలి.

ap minister roja counter to mega brother nagababu

Advertisement

Nagababu – Roja : విమర్శ చేయాలనుకుంటే విషయం ఉంటేనే చేయాలి అంటూ రోజా కౌంటర్

నోటికి ఎంత వస్తే అంత వాగడం కాదు. ఫేక్ వార్తలతో దుష్ప్రచారాలు చేయడం కాదు. ఏపీ గురించి అసలు మీకు అవగాహన లేదు. అది జీరో అని నాకే కాదు అందరికీ తెలుసు. నా శాఖ గురించి, నా శాఖ అభివృద్ధి గురించి వ్యాఖ్యలు చేయడం అంటే.. అది నీ అవగాహన రాహిత్యం అనే చెప్పాలి. 2021 లో దేశ వ్యాప్తంగా చూసుకుంటే.. ఏపీ టాప్ 3 లో ఉంది. తమిళనాడు ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. నాగబాబు మాత్రం అన్నీ తప్పుడు లెక్కలు చెప్పారు.. అంటూ నాగబాబుకు భలే కౌంటర్ ఇచ్చింది రోజా.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి