Vidadala Rajini : జగన్ ఆనందంతో కాలర్ ఎగరేసాడు.. విడదల రజని తీసుకున్న నిర్ణయం అలాంటిది మరి !
Vidadala Rajini : ఆదివాసీలు, గిరిజనులు అడవి బిడ్డలు. వాళ్లు అందుకే ప్రకృతిలోనే పెరుగుతారు. అక్కడే తమ జీవనం సాగిస్తుంటారు. వాళ్లకు ఏదైనా అనుకోని ప్రమాదం వచ్చినా, ఆరోగ్య సమస్యలు వచ్చినా పట్టణాలకు రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ముఖ్యంగా నవజాత శిశువుల విషయంలో గిరిజన ప్రాంతాల నుంచి వైజాగ్ కు చికిత్స కోసం వచ్చే వాళ్లు శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఏపీ మంత్రి విడదల రజిని అన్నారు. వైద్యారోగ్య అధికారులతో సమీక్ష నిర్వహించిన రజిని.. అరుకు, పాడేరు, ఇతర మారుమూల
గిరిజన ప్రాంతాల నుంచి వైద్య సేవల కోసం వచ్చే ప్రజలకు, ఆయా ప్రాంతాలకు వైద్య సేవలు పూర్తిగా అందుబాటులోకి రావాలన్నారు.వైద్య ఆరోగ్యశాఖను సీఎం జగన్ నిరంతరం అప్రమత్తం చేస్తున్నారని, రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా వైద్య సేవలు అందుబాటులోకి రావాలని సీఎం పరితపిస్తున్నారని ఆమె చెప్పారు. చింతూరు ప్రాంతంలో ఇప్పటి వరకు ఒక్క డాక్టర్ కూడా లేరని, కానీ తమ ప్రభుత్వం వచ్చాక చింతూరు గిరిజన ప్రాంతంలో 40 ఏళ్ల తర్వాత స్పెషలిస్ట్ డాక్టర్ ను నియమించామని, ఆ ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
Vidadala Rajini : మూఢనమ్మకాలతో నాటు వైద్యం చేయించుకోకండి
చాలామంది గిరిజన ప్రాంతాల్లోని వారు హైబీపీ, మూఢనమ్మకాలు, ఇతర నాటు వైద్యాన్ని నమ్ముకొని తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారని, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇటీవల మరణించిన ఆరుగురు మరణించడం కేవలం మూఢనమ్మకం వల్లనే అని ఆమె స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాలకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడం, వాళ్లకు పట్టణాల్లో అన్ని రకాల వైద్య సౌకర్యాలను కల్పిస్తామని ఈసందర్భంగా మంత్రి రజిని స్పష్టం చేశారు.