Ap NGO : సమ్మెకు సై అంటోన్న ఏపీ ఎన్జీవోలు.. ఫిబ్రవరి 7 తర్వాత ఏ క్షణమైనా..!
Ap NGO : ఏపీ ఎన్జీవోల సంఘానికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం రోజురోజుకీ తీవ్రంగా మారుతోంది. తమను కష్టాల్లోకి నెట్టేలా ఉన్న జీవోలను రద్దు చేసే వరకు పోరాడుతూనే ఉంటామని హెచ్చరిస్తున్న ఎన్జీవోల సంఘం… ఫిబ్రవరి 7 తరువాత ఏ క్షణమైనా సమ్మెకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.ప్రభుత్వం తమను దారుణంగా మోసం చేసిందన్నారు.
ఉద్యోగ సంఘాల నేతలు సమ్మెపై ఈ మేరకు రేపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసులు అందించనున్నట్లు సమాచారం. అయితే అప్పటివరకు అనగా వచ్చే నెల 7వ తేదీ వరకు వారు చేయదలచిన ఉద్యమ కార్యాచరణను ఇప్పటికే రూపొందించారు. గత రాత్రి జరిగిన ఈసీ మీటింగ్‌లో ఏపీఎన్జీవో సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక ఇదే విషయమై… ఎన్జీవోల నిర్ణయం ప్రకారమే ముందుకు తాము కూడా ముందుకు వెళతామని ఇతర ఉద్యోగ సంఘాలు కూడా చెబుతున్నాయి. తమకు అనుకూలంగా పీఆర్సీపై మరో ప్రకటన చేసే వరకు తమ పోరాటం ఆపేది లేదని వారు కూడా హెచ్చరిస్తున్నారు. మరి ఈ అంశంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.