TDP : తెలుగు దేశం పార్టీ మరింత పాతాళానికి దిగజారుతోంది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TDP : తెలుగు దేశం పార్టీ మరింత పాతాళానికి దిగజారుతోంది

 Authored By prabhas | The Telugu News | Updated on :19 June 2022,7:00 am

TDP : తెలుగు దేశం పార్టీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది. ఒకప్పుడు ఇంత కాలం అధికారంలో ఉన్నాం.. అప్పుడు అలా చేశాం ఇలా చేశాం అంటూ గొప్పలు చెపుకుంటున్నారు. అప్పుడు వీరి పాలనను చూసిన వారు ఇప్పుడు కూడా ఉన్నారు. వారికి అన్ని విషయాలు తెలుసు అనే విషయాన్ని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గుర్తించడం లేదు. అప్పుడు తెలుగు దేశం పార్టీ పేదలపై ముఖ్యంగా రైతులపై కురిపించిన లాఠీలు మరియు బుల్లెట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినా కూడా మేము గొప్పగా చేశాం అంటూ చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలుగు దేశం పార్టీ ఒక్క ఛాన్స్ అన్నట్లుగా ప్రచారం చేస్తోంది. గతంలో చాలా ఛాన్స్ లు ఇచ్చిన సమయంలో రాష్ట్రంను నాశనం చేశారు.,. ఇప్పుడు మళ్లీ ఒక్క ఛాన్స్ ఎలా అడుగుతున్నారు. అర్హత లేని వారికి మంత్రి పదువులు ఇచ్చి.. రాజకీయంను నీచంగా మార్చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగు దేశం పార్టీ నాయకులకే స్వయంగా తమ పార్టీ 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేదు. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు అనిపిస్తుంది. మళ్లీ ఈవయసులో కూడా సీఎం అవ్వాలని ఆయన పడుతున్న తాపత్రయం చూస్తుంటే జనాలకు కూడా అనుమానంగా ఉంది.

ap people don't want Telugu Desam Party ruling

ap people don’t want Telugu Desam Party ruling

ఇన్నాళ్లు సంపాదించిన సంపాదన సరిపోలేదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. అధికార దాహం ఇంతగా ఉన్న వ్యక్తిని మరెక్కడ చూడలేదు అంటున్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వంను దించాల్సిన అవసరం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే అసలు తెలుగు దేశం పార్టీ ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పొత్తులు.. ఎత్తులు అంటూ తిరుగుతున్న వారిని జనాలు నమ్మరు.. ఇప్పటికే వారు పాతాళానికి తొక్కబడ్డారు. ముందు ముందు మరింత దారుణమైన పరిస్థితి వారు వెళ్తారు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది