Apple iPhone 13 : అమెజాన్‌లో యాపిల్ ఐఫోన్ 13 కొనుగోలుపై భారీ డిస్కౌంట్స్
Apple iPhone 13 : యాపిల్ ఐఫోన్ ప్రియులకు కొనుగోలుపై ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించాయి. 128GB, 256GB మరియు 512GB స్టోరేజ్ వేరియెంట్ మొబైల్స్ ప్రస్తుతం రూ. 5,000 తక్షణ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ 128GB మోడల్ ధర రూ.74,900 కాగా, 256GB మోడల్ ధర రూ.84,900. టాప్ 512GB రూ. 1,04,900గా ఉన్నాయి. కోటక్ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్‌లు, ICICI బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్‌లు, SBI క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లు రూ. 6,000 తగ్గింపును అందుకుంటారు.మీరు అమెజాన్ పే ఐసీసీఐ క్రెడిట్ కార్డ్‌తో చెల్లిస్తే, మీరు చెక్అవుట్‌లో రూ. 3,603 తిరిగి పొందుతారు.
అమెజాన్ కూడా రూ.16,800 విలువైన ఎక్స్ఛేంజ్ డీల్‌ను అందిస్తోంది.మంచి పనితీరులో ఉన్న పాత iPhoneలు Android సెల్‌ఫోన్‌ల కంటే ఎక్కువ మార్పిడి రేటును పొందే అవకాశం ఉంది. గతేడాది, ఐఫోన్ 13 భారత మార్కెట్లోకి రూ. 79,900 వద్ద విడుదలైంది. ఫ్లిప్‌కార్ట్ డీల్ వివరాలను క్షణ్నంగా పరిశీలిస్తే.. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 13పై రూ. 5,000 తగ్గింపు అందిస్తోంది. అంటే, ఐఫోన్ 13 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.74,900 వద్ద లభిస్తుంది. ఇక, మీరు పాత ఐఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఐఫోన్ 13పై గరిష్టంగా రూ. 18,850 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.మీ పాత ఐఫోన్ XR 64GB వేరియంట్‌పై రూ. 14,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తోంది.

apple iphone 13 gets a massive discount
Apple iPhone 13 : అద్భుతమైన ఆఫర్..
అయితే, జనవరి 26 రిపబ్లిక్ డే సేల్స్ సందర్భంగా, ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ XR పై రూ. 18,000 డిస్కౌంట్ ఇస్తోంది. దీంతో, మీ పాత ఐఫోన్ XR ఎక్స్ఛేంజ్పై భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ఇలా, అన్ని ఆఫర్లను పరిగణలోకి తీసుకుంటే ఐఫోన్ 13ను కేవలం రూ. 56,000 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అంటే, ఐఫోన్ 12 ధర వద్దే సరికొత్త ఐఫోన్ 13 మోడల్ లభిస్తుందనే విషయం స్పష్టమవుతోంది. యాపిల్ ఐఫోన్‌కు మార్కెట్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రీమియం సెగ్మెంట్లో లభించే ఈ ఫోన్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతాయి. అయితే ధర కాస్త ఎక్కువగా ఉండటంతో ఐఫోన్ కొనేందుకు కొంత మంది వెనకడుగువేస్తుంటారు