Amazon : ఆపిల్ ఐఫోన్ 13 పై బంపర్ ఆఫర్… ఐఫోన్ 14 కన్నా ఇదే బెస్ట్… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Amazon : ఆపిల్ ఐఫోన్ 13 పై బంపర్ ఆఫర్… ఐఫోన్ 14 కన్నా ఇదే బెస్ట్…

 Authored By aruna | The Telugu News | Updated on :27 August 2022,7:30 am

Amazon : ఇప్పుడు ఆపిల్ ఐఫోన్ 13 భారీ డిస్కౌంట్ ఆఫర్ తో వచ్చింది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఐఫోన్ 13 పై 9000 భారీ డిస్కౌంట్ అందిస్తుంది. వినియోగదారులు ఐఫోన్ 13 ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ పోయిన సంవత్సరంలోనే మార్కెట్లోకి వచ్చింది. ఇప్పటికే చాలాసార్లు తగ్గింపు ధరతో వచ్చింది. మళ్ళీ అమెజాన్ ఐఫోన్ 13ని 70, 900 అమ్మకానికి అందిస్తుంది .దీని అసలు ధర 79,900 అంటే 9000 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. అయితే ఈ ఆఫర్ గడువు ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కొనాలనుకునేవారు వెంటనే ఐఫోన్ 13న కొనేసుకోండి. అయితే ఐఫోన్ 13 కొనాల లేదా ఐఫోన్ 14ను కొనాల అని ఆలోచిస్తున్నారా అయితే ఐఫోన్ 13ను కొనడమే బెస్ట్. ఎందుకంటే ఐఫోన్ 14 కొత్త రెగ్యులర్ మోడల్ పాత చిప్ సెట్ తో రానుంది. ఐఫోన్ 13 కన్నా పెద్ద అప్గ్రేడ్ ఏమీ ఉండకపోవచ్చు అని తెలుస్తుంది.

కొత్త ఐఫోన్ 14 లోను ఐఫోన్ 13 లాగానే ఫీచర్లు ఉంటాయని నివేదికలు సూచిస్తున్నాయి. నిజానికి కొత్త ఐఫోన్ 14 ను ఎక్కువ ధరకు మార్కెట్లోకి తీసుకురావాలని ఆపిల్ భావిస్తుందని కొంతమంది నిపుణులు అంటున్నారు. మీకు అంతకుముందే ఐఫోన్ 13 ఫోన్ ఉంటే ఐఫోన్ 14 కోసం ఎక్కువ ఖర్చు చేయడంలో ఎటువంటి లాభం ఉండదు. మీరు సాఫ్ట్వేర్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆపిల్ ఆరేళ్ల స్మార్ట్ ఫోన్ కు సరికొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ ను విడుదల చేస్తుంది. ఐఫోన్ 14 కూడా అదే A15 బయానిక్ చిప్ సెట్ తో రానుంది. ఐఫోన్ 13 సిరీస్ లోను అదే రన్ అవుతుంది. అదే స్క్రీన్ సైజ్ కలిగి ఉండనుంది. కానీ అధిక 90Hz రిఫ్రెష్ రేటుతో రావచ్చు. ఈ డివైస్ పాత ఫోన్ల లాగానే 12 ఎంపీ డ్యూయల్ రియల్ కెమెరా సెట్ అప్ ను కలిగి ఉంటుంది. ఆపిల్ సాఫ్ట్వేర్ విభాగంలో కొన్ని మార్పులు చేస్తుందని మెరుగైన అనుభవం కోసం కొత్త ఫోటోగ్రఫీ టీచర్లను కూడా అందిస్తుందని భావిస్తున్నారు.

Apple iphone rs 9000 discount on Amazon

Apple iphone rs 9000 discount on Amazon

కొత్త ఫోన్ కూడా పాత ఫోన్ లాగానే ఉంటుందని, 14 ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్ తో వస్తుందని, వైడ్ నాచ్ ని కలిగి ఉంటుందని అంటున్నారు.120Hz రీ ఫ్రెష్ రేట్ లేదా LTPO డిస్ప్లే కు సపోర్ట్ తో పంచ హోల్డ్ డిస్ప్లే డిజైన్ లేదు. ఎక్కువ ధర కలిగిన ఐఫోన్ 14 మోడల్ లో అందుబాటులో ఉంటాయని అంటున్నారు. కొత్త ఫోన్ పాత ఫోన్ కన్నా మెరుగైన బ్యాటరీ లైఫ్ అందిస్తుందని భావిస్తున్నారు. ఐఫోన్ 13 కొనడం వలన ఎలాంటి ఆందోళన అక్కర్లేదు కానీ ఇకపై రిటైల్ బాక్స్ లో చార్జర్ తో అందించడం లేదని గుర్తుంచుకోవాలి. చార్జర్ కొనుక్కోవాలి లేదా పాతదాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ కోసం 12,750 వరకు తగ్గింపు పొందవచ్చు. ఐఫోన్ కండిషన్ ఆధారంగా ఎక్సైజ్ ఆఫర్ ఉంటుంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది