Apple iPhone 18 Pro Max | ఐఫోన్ 18 ప్రో మాక్స్ లీక్స్.. భారీ అప్‌గ్రేడ్స్‌తో 2026లో ఆపిల్ కొత్త ఫ్లాగ్‌షిప్
Apple iPhone 18 Pro Max | ఆపిల్ అభిమానులకు మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. 2026లో విడుదలకానున్న ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఫీచర్లు, డిజైన్, ధరకు సంబంధించి ముందస్తు వివరాలు లీక్ అయ్యాయి. ఐఫోన్ 17 ప్రో మాక్స్ తర్వాత, ఇది మరో ఫ్లాగ్‌షిప్ మాస్టర్‌పీస్‌గా మారనుందని అంచనాలు ఉన్నాయి.

#image_title
ఐఫోన్ 18 ప్రో మాక్స్ డిజైన్
చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబోలో వెలువడిన లీక్‌ల ప్రకారం, ఐఫోన్ 18 ప్రో మాక్స్ కొత్త డిజైన్‌తో రానుంది. దీర్ఘచతురస్రాకార కెమెరా హౌసింగ్ కొనసాగనుండగా, బ్యాక్ ప్యానెల్‌లో మైక్రో ట్రాన్స్‌పరెంట్ ఎలిమెంట్ ఉండే అవకాశముంది. ఇంకా ఫైనల్ డిజైన్ ఖరారు కాలేదు కానీ, స్టెయిన్‌లెస్ స్టీల్ స్టీమ్ చాంబర్ వంటివి వేడి నిర్వహణ కోసం వాడొచ్చని సమాచారం.
డిస్‌ప్లే పరంగా ఐఫోన్ 18 ప్రో – 6.3 అంగుళాల స్క్రీన్, ప్రో మాక్స్ – 6.9 అంగుళాల డిస్‌ప్లే వచ్చే అవకాశం, కెమెరాలో బిగ్ లీవప్ – వేరియబుల్ ఎపర్చర్ టెక్నాలజీ, ఐఫోన్ 18 ప్రో మాక్స్ ప్రధాన ఆకర్షణ కెమెరా అప్‌గ్రేడ్ కావచ్చు.48 మెగాపిక్సల్ మెయిన్ సెన్సార్, వేరియబుల్ ఎపర్చర్ టెక్నాలజీ – ఫొటోగ్రఫీ, లో-లైట్ షూటింగ్‌కు అదనపు కంట్రోల్, లెన్స్ అడ్జస్ట్ చేసుకునే స్వేచ్ఛ – ఫోటోగ్రాఫర్లకు బెస్ట్ టూల్‌గా మారే అవకాశం, ఈ టెక్నాలజీ ఇప్పటికే కొన్ని హైఎండ్ ఆండ్రాయిడ్ ఫోన్లలో కనిపించగా, ఇప్పుడు ఐఫోన్‌కి వచ్చే అవకాశం ఉండటం ఫోటోగ్రఫీ ప్రపంచంలో కొత్త అధ్యాయాన్ని తెరుస్తుంది.ఐఫోన్ 18 ప్రో మాక్స్‌లో Apple A20 Pro చిప్ ఉపయోగించనున్నట్లు సమాచారం. ఇది 2nm టెక్నాలజీపై నిర్మించబడి ఉంటుంది.