SL vs PAK | శ్రీలంక- పాకిస్తాన్ మధ్య హోరాహోరీ పోరు.. ఓడితే పాక్ ఇంటికేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

SL vs PAK | శ్రీలంక- పాకిస్తాన్ మధ్య హోరాహోరీ పోరు.. ఓడితే పాక్ ఇంటికేనా?

 Authored By sandeep | The Telugu News | Updated on :23 September 2025,8:00 pm

SL vs PAK | ఆసియాకప్ 2025 టోర్నీలో సూపర్-4 దశ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ చేతిలో ఓటమి చెందిన శ్రీలంక, టీమిండియా చేతిలో పరాజయం పాలైన పాకిస్తాన్ జట్లు ఈరోజు (SL vs PAK) కీలకమైన మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. అబుదాబీలో జరిగే ఈ మ్యాచ్‌పై అభిమానుల కళ్లన్నీ నిలిచాయి.ఈ మ్యాచ్ ఫలితం రెండు జట్లకూ అత్యంత కీలకం.

#image_title

డూ ఆర్ డై..

ఇప్పటికే ఓ ఓటమి మూటగట్టుకున్న పాక్, లంకలు ఫైనల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టు టోర్నీకి గుడ్‌బై చెప్పాల్సిందే. గ్రూప్ ద‌శలో వరుస విజయాలతో దూసుకెళ్లిన శ్రీలంక, సూపర్-4 ప్రారంభంలో బంగ్లాదేశ్ చేతిలో షాకింగ్ ఓటమి చవిచూసింది. సేఫ్ జోన్‌లో ఉండాలంటే పాక్, భారత్‌లపై విజయాలు సాధించాల్సిన దుస్థితిలో ఉంది.మరోవైపు పాక్ ప‌రిస్థితి అలానే ఉంది.

భారత జట్టుతో గ్రూప్‌ దశ, సూపర్-4 రెండింట్లోనూ ఓటమి పాలైంది. ఇకపై బంగ్లా, లంకపై గెలిస్తేనే పాక్ ఫైనల్ ఆశలు నిలబెట్టుకోగలదు. అందుకే ఈ రోజు జరిగే మ్యాచ్ పాక్‌కు ‘డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పాలి. ఇప్పటివరకు ఇరు జట్లు 23 టీ20 మ్యాచ్‌లలో తలపడగా, పాక్ 13 విజయాలు, లంక 10 విజయాలు సాధించాయి. అయితే గత ఐదు టీ20లలో లంకదే పైచేయి, అన్నింటిలోనూ విజయం సాధించింది. ప్రస్తుత ఫామ్ చూస్తే లంకే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది