Astrologer Sadguru : ఉగాది వచ్చేసింది. మనం శోభకృత్ నామ సంవత్సరంలోకి ఎంట్రీ ఇచ్చాము. శోభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుంది.. ఈసారి రాజకీయ నాయకులకు ఎలా ఉంటుంది. సాధారణ ప్రజలకు ఎలా ఉంటుంది. వర్షాలు పడుతాయా? శుభ ఫలితాలు ఉన్నాయా? అనే విషయాలను పంచాంగ శ్రవణం ద్వారా పండితులు చెబుతుంటే ప్రజలంతా తెలుసుకున్నారు. అయితే.. చాలామంది ప్రస్తుతం చర్చించుకునే విషయం ఏపీ ఎన్నికల గురించే. ఏపీలో 2024 లో ఎన్నికలు రానున్నాయి. ప్రముఖ ఆస్ట్రాలజర్ సద్గురు శ్రీ విద్యానంద శాస్త్రి ఏపీలో ఎన్నికల గురించి మాట్లాడారు.
ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయా? అనే దానిపై ఆయన ఉగాది పంచాంగ శ్రవణం ద్వారా చెప్పుకొచ్చారు. ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో ఏం జరగనుంది.. సామాన్య ప్రజలకు ఎలా ఉండబోతుంది అనే విషయాలపై ఆయన మాట్లాడారు. ఏపీలో ప్రస్తుతం అందరూ చర్చించుకునే విషయం ఎన్నికలు. వచ్చే సంవత్సరం ఏపీలో ఎన్నికలు రానున్నాయి. కానీ.. ఏపీలో ఎన్నికలు ముందస్తు రానున్నాయి అనే వార్తలు వినవస్తున్నాయి. దానిపై శాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం రాజకీయ పరిణామాలు కొత్త దారులు తొక్కుతాయన్నారు.
ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఒకవేళ ముందస్తు ఎన్నికలు జరిగితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వమే గెలుస్తుందన్నారు. వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికలు అయితే ప్రతిపక్షాలకు బలం ఉంటుందని.. ముందస్తు జరిగితేనే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు మళ్లీ గెలిచే అవకాశం ఉందని శ్రీ విద్యానంద శాస్త్రి చెప్పుకొచ్చారు. దానికి కారణం.. శని వక్రంలో ఉండటం. మే 8 నుంచి నవంబర్ వరకు శని వక్రంలో ఉండటం వల్ల అన్నింట్లో ఆశించిన ఫలితాలు చేతి దాకా వచ్చి చేజారుతాయి అని ఆయన చెప్పుకొచ్చారు. శని వక్రం వల్లనే రాజకీయ పరిణామాల్లో పలు మార్పులు చోటు చేసుకుంటాయని, కొత్త దారులు తొక్కుతాయని ఆయన స్పష్టం చేశారు.
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
This website uses cookies.