Home » Entertainment » Nani Dasara Movie Story Leaked
Entertainment

Dasara Movie : బిగ్ బ్రేకింగ్.. లీక్ అయిపోయిన దసరా సినిమా కథ .. నాని కొంప మునిగింది !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: March 25, 2023 1:29 pm
Advertisement

Dasara Movie : తెలుగులో నాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నాని త్వరలోనే ‘ దసరా ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో నాని పక్కా మాస్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా కొద్ది రోజుల్లోనే థియేటర్స్ లలో విడుదల కాబోతుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న దసరా సినిమాలో స్నేహానికి సంబంధించిన ట్విస్ట్ ఉండబోతుందని అంటున్నారు. ఆ ట్విస్ట్ సెన్సార్ ద్వారా బయటికి లీక్ అయింది. సహజంగా సెన్సార్ బోర్డ్ సభ్యులు ఏ సినిమా అయినా చూశాక అందులో అభ్యంతరాలు ఉంటే తీసేయమని చెబుతుంటారు.

Advertisement

Nani Dasara Movie story leaked

ఎక్కువగా డైలాగులను పాయింట్ అవుట్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా నాని దసరా సినిమాను సెన్సార్ బోర్డు వారు చూడడం జరిగింది. అయితే ఈ సినిమాలో కొన్ని డైలాగులను మ్యూట్ చేయాలని, కొన్ని షాట్స్ ను తొలగించాలని కోరారట. ముఖ్యంగా ఈ సినిమాలో బాడ్ కవ్, బాంచత్ వంటి బూతులను తొలగించాలని తెలిపారట. అంతేకాకుండా ఈ సినిమాలో సూరి పాత్ర చనిపోయాక డెడ్ బాడీ పై చూపించే సీన్ ను సెన్సార్ బోర్డ్ అభ్యంతరం చెప్పింది. ఈ సినిమాలో ధరణికి సూరి అనే ఫ్రెండ్ ఉంటాడు. ఆ పాత్రను దీక్షిత్ శెట్టి చేశాడు.

Advertisement

ఆ పాత్ర చుట్టే ఈ సినిమా కథ నడుస్తుందని లీకులు బయటకు వచ్చాయి. తాజాగా సెన్సార్ కాపీలో సూరి డెడ్ బాడీ అని ఉండడంతో సినిమా ఆ ట్విస్ట్ బయటికి వచ్చింది. సెన్సార్ కట్ చేసిన ఆ కాపీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దసరాలో ఇదే మెయిన్ ట్విస్ట్ అని నెటిజన్లు భావిస్తున్నారు. దీంతో ఈ సినిమా స్టోరీ లీక్ అయిందంటూ, నాని కొంపమునిగింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమా రెండు వారాలలో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. పవర్ ఫుల్ యాక్షన్ లో కనిపిస్తున్న నాని సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి