Astrology Predictions : కలలో ఈ వస్తువులు కనిపిస్తే.. మీరు అదృష్టవంతులేనండోయ్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Astrology Predictions : కలలో ఈ వస్తువులు కనిపిస్తే.. మీరు అదృష్టవంతులేనండోయ్..

Astrology Predictions : జనరల్‌గా ప్రతీ ఒక్కరు కలలు కంటుంటారు. అయితే, నిజానికి కొందరు రాత్రి పూట కనే కలలపైన ఎక్కువ ఫోకస్ చేయబోరు. అవి అస్సలు నిజం కావు అని అంటారు. కానీ, ప్రజలకున్న విశ్వాసాల ప్రకారం.. రాత్రి పూట వచ్చే కలలు, మధ్యాహ్నం, ఇతర వేళల్లో వచ్చే కలలకూ అర్థాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు వచ్చే ప్రతీ కలకు అర్థం ఉందని కొందరు జ్యోతిష్య శాస్త్ర పెద్దలు చెప్తున్నారు. అలా కలలో […]

 Authored By mallesh | The Telugu News | Updated on :25 January 2022,4:30 pm

Astrology Predictions : జనరల్‌గా ప్రతీ ఒక్కరు కలలు కంటుంటారు. అయితే, నిజానికి కొందరు రాత్రి పూట కనే కలలపైన ఎక్కువ ఫోకస్ చేయబోరు. అవి అస్సలు నిజం కావు అని అంటారు. కానీ, ప్రజలకున్న విశ్వాసాల ప్రకారం.. రాత్రి పూట వచ్చే కలలు, మధ్యాహ్నం, ఇతర వేళల్లో వచ్చే కలలకూ అర్థాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు వచ్చే ప్రతీ కలకు అర్థం ఉందని కొందరు జ్యోతిష్య శాస్త్ర పెద్దలు చెప్తున్నారు. అలా కలలో వచ్చే వాటి ద్వారా నిజ జీవితంలో కొంత మేర అయినా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కలలో వచ్చే కొన్ని రకాల వస్తువులు, జంతువులు, ఇతరాల ద్వారా భవిష్యత్తులో జరిగే పరిణామాలపైన ప్రభావం ఉంటుందని పెద్దలు వివరిస్తున్నారు.

జ్యోతిష్యం ప్రకారం జరిగే ఆ ప్రభావాలేంటంటే..ఒకవేళ మీకు కలలో అగ్ని కనబడినట్లయితే మీకు శుభం కలుగుతుందనే సంకేతాలు వచ్చినట్లే.. మంటలు, వంట చేయడం లాంటివి కనబడితే జీవితంలో పురోగతి సాధించినట్లేనని చెప్తున్నారు. మీకు కలలో డబ్బులు కనబడితే రాబోయే రోజుల్లో మరింత డబ్బును మీరు పొందతున్నారని అర్థం. కాగా కలలో దానిమ్మ పండ్లు తింటున్నట్లు కల వస్తే కనుక మీ ఇంటి కి త్వరలో లక్ష్మీ దేవి వస్తుందని సంకేతాలు వచ్చినట్లేనని జ్యోతిష్య శాస్త్ర పెద్దలు వివరిస్తున్నారు.

astrology predictions things in dreams you will get more money and prestage

astrology predictions things in dreams you will get more money and prestage

Astrology Predictions : అలా అయితే మీ పంట పండినట్లే..

కలలో రంగులు కనబడితే కనుక మీ ప్రతిష్ట జీవితంలో ఇంకా పెరుగుతుందని భావించాలి. ఇకపోతే మీకు కలలో తేనే, పాలు కనబడినట్లయితే శుభ సూచికగా భావించాల్సి ఉంటుంది. మీరు గుర్రంపైన స్వారీ చేస్తున్నట్లు కలలో వచ్చినట్లయితే త్వరలో మీ జీవితంలో ఏదేని శుభవార్త వింటారని స్పష్టంగా చెప్పినట్లేనట. ఇకపోతే రైతులు మీకు కలలో వచ్చినా శుభ సంకేతంగానే భావించాలి. రైతులు కలలో వచ్చినట్లయితే మిమ్మల్ని లక్ష్మీ దేవి వరించనుందని అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా స్థిరపడుతారు కూడా.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది