ATM : బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఏటీఎంకు వెళ్తున్నారా.. జనవరి 1 నుంచి కొత్త రూల్స్..!
ATM ఏటీఎం నుంచి తరచూ డబ్బులు విత్‌డ్రా చేసుకునే వారికో షాకింగ్ న్యూస్. ఏటీఎం ట్రాన్సాక్షన్స్ కు సంబంధించి కొత్త ఏడాది నుంచి కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. బ్యాంక్ ఖాతాదారులు నూతన ఏడాది నుంచి ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయెల్స్‌కు సంబంధించి ఇప్పటినుంచి ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. తాజా నిబంధనల ప్రకారం కస్టమర్ల నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితి దాటిన అనంతరం తర్వాత ఈ చార్జీల బాదుడు మొదలవుతుందట. మరో మూడు రోజుల తర్వాత నుంచి ఈ కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్న అంశానికి సంబంధించి ఈ మేరకు ఆయా బ్యాంక్ ల నుంచి వారి కస్టమర్లకు ఇప్పటికే సవరించిన చార్జీల సందేశాలు పంపుతున్నారు.
ATM : 5 సార్లు దాటితే రూ. 21 అదనపు వసూలు..
రిజర్వ్ బ్యాంకు తాజా నిబంధనలకు అనుగుణంగా ఉచిత లావాదేవీల పరిమితి దాటిన అనంతరం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఫీజు రూ.21గా ఉంటుందని ఇప్పటికే యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. దీనికి జీఎస్‌టీ కూడా అదనంగా ఉండనుంది. ఇకపోతే బ్యాంక్ కస్టమర్లు నెలలో ఏటీఎం నుంచి 5 సార్లు చార్జీలు లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే ఇతర బ్యాంకుల ఏటీఎం నుంచి మెట్రో నగరాల్లో 3 సార్లు, నాన్ మెట్రో నగరాల్లో 5 సార్లు చార్జీలు లేకుండా ట్రాన్సాక్షన్లు జరపవచ్చు. వీటి అనంతరం చేసే తదుపరి ట్రాన్సాక్షన్ కు రూ. 21 అదనంగా చెల్లించాల్సిందే.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గత జూన్ నెలలోనే చార్జీల పెంపునకు అనుమతి ఇస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకుంది అధిక ఇంటర్‌ఛేంజ్ ఫీజు నేపథ్యంలో బ్యాంకులకు కొంత ఉపశమనం కలిగించేందుకు 2022 జవనరి 1 నుంచి ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయెల్ చార్జీలను రూ.21కు పెంచుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నూతన ఏడాది నుంచి ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయెల్స్‌పై చార్జీల మోత మోగనుంది. అయితే ఈ ఫైన్ ను తప్పించుకోవాలని భావిస్తే.. ఒకేసారి పెద్ద అమౌంట్ ను విత్‌డ్రాయెల్ చేసుకుని పెట్టుకుంటే మంచిది. చిన్న చిన్న అమౌంట్ కే తరచూ ఏటీఎంలకు వెళ్తూ ఉంటే మాత్రం చార్జీల బాదుడు తప్పదనే చెప్పాలి.