Bank Holidays : బ్యాంకులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు..!
ప్రధానాంశాలు:
Bank holidays : బ్యాంకులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు..!
Bank Holidays : నేడు నాలుగో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు Government and private banksమూతపడ్డాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రతి నెల రెండో, నాలుగో శనివారాల్లో బ్యాంకులకు తప్పనిసరి సెలవు ఉంటుంది. దీనికి తోడు రేపు ఆదివారం కావడంతో ఖాతాదారులకు వరుసగా రెండు రోజుల బ్రేక్ లభించింది. ఇక కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే శుక్రవారం సెలవు ఉండటం సోమవారం రిపబ్లిక్ డేRepublic Day కావడం వల్ల ఈసారి బ్యాంకింగ్ రంగంలో పూర్తి స్థాయి లాంగ్ వీకెండ్ నెలకొంది. దీంతో బ్యాంకు పనుల కోసం వెళ్లే వారు ముందస్తుగా ప్రణాళిక వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
(102) Bank holidays : బ్యాంకులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు..!
Bank Holidays : వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్ ఉన్న రాష్ట్రాలు
కొన్ని రాష్ట్రాల్లో ఈసారి బ్యాంకులకు శుక్రవారం నుంచే సెలవులు ప్రారంభమయ్యాయి. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, త్రిపుర రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేశారు. ఆ తర్వాత జనవరి 24 నాలుగో శనివారం జనవరి 25 ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయలేదు. ఇక జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశమంతటా అన్ని బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఇలా కొన్ని ప్రాంతాల్లో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు బ్రాంచ్ స్థాయిలో అందుబాటులో ఉండవు. ముఖ్యంగా చెక్కుల క్లియరెన్స్, డాక్యుమెంటేషన్, లోన్ల ప్రాసెసింగ్ వంటి పనులు ఈ రోజుల్లో నిలిచిపోతాయి.
Bank Holidays : జనవరి 2026 బ్యాంకు సెలవులు.. వినియోగదారులకు సూచనలు
ఆర్బీఐ విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం జనవరి 2026లో అనేక రాష్ట్రాల వారీ సెలవులు ఉన్నాయి. నూతన సంవత్సర వేడుకలు, మన్నం జయంతి, హజ్రత్ అలీ జయంతి, మకర సంక్రాంతి, పొంగల్, తిరువళ్లువర్ దినోత్సవం, ఉలవర్ తిరునాళ్ వంటి పండుగల కారణంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. అలాగే రెండో శనివారం, నాలుగో శనివారం, అన్ని ఆదివారాలు సాధారణ బ్యాంకు సెలవులే. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు బంద్ అవుతాయి. అయితే బ్రాంచ్‌లు మూసి ఉన్నా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఖాతా వివరాలు చూసుకోవచ్చు ఫండ్ ట్రాన్స్‌ఫర్లు చేయవచ్చు. ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణకు ఇబ్బంది ఉండదు. ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలు కూడా ఎప్పటిలాగే పనిచేస్తాయి. కానీ చెక్కుల క్లియరెన్స్ డిమాండ్ డ్రాఫ్ట్‌లు కొన్ని అధికారిక లావాదేవీలు మాత్రం సెలవు రోజుల్లో జరగవు. స్థానిక పండుగలు రాష్ట్రాల వారీగా సెలవుల్లో మార్పులు ఉండే అవకాశం ఉన్నందున వినియోగదారులు తమ సమీప బ్యాంకు శాఖ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా సెలవుల జాబితాను ఒకసారి ధృవీకరించుకోవడం మంచిదని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు. ముందస్తు ప్రణాళికతోనే ఈ లాంగ్ వీకెండ్‌లో ఇబ్బందులు లేకుండా బ్యాంకింగ్ అవసరాలు తీర్చుకోవచ్చు.