కోడలికి కడుపొచ్చింది .. కానీ ఎవ్వరికీ చెప్పలేదు .. అత్తగారు ఏం చేసిందో మీరు కల్లో కూడా గెస్ చెయ్యలేరు ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

కోడలికి కడుపొచ్చింది .. కానీ ఎవ్వరికీ చెప్పలేదు .. అత్తగారు ఏం చేసిందో మీరు కల్లో కూడా గెస్ చెయ్యలేరు !

తాజాగా సోషల్ మీడియాలో అత్తా కోడలు మధ్య జరిగిన గొడవ వైరల్ అవుతుంది. అత్త అంటే అమ్మ లాంటిది అంటుంటారు. అలాంటి అత్త కోడలిని ఓ రేంజ్ లో ఉతికి పారేసింది. అత్త ఇంతలా మండిపడిందంటే కోడలు ఏం చేసి ఉంటుందో అని అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది. అసలు విషయంలోకి వెళితే కరీంనగర్ కు చెందిన ఓ యువతి వైద్య సేవల కోసం తన తల్లితో కలిసి ఆస్పత్రికి వెళ్ళింది. వైద్య పరీక్షలు చేస్తుండగా సదరు […]

 Authored By aruna | The Telugu News | Updated on :17 June 2023,2:00 pm

తాజాగా సోషల్ మీడియాలో అత్తా కోడలు మధ్య జరిగిన గొడవ వైరల్ అవుతుంది. అత్త అంటే అమ్మ లాంటిది అంటుంటారు. అలాంటి అత్త కోడలిని ఓ రేంజ్ లో ఉతికి పారేసింది. అత్త ఇంతలా మండిపడిందంటే కోడలు ఏం చేసి ఉంటుందో అని అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది. అసలు విషయంలోకి వెళితే కరీంనగర్ కు చెందిన ఓ యువతి వైద్య సేవల కోసం తన తల్లితో కలిసి ఆస్పత్రికి వెళ్ళింది. వైద్య పరీక్షలు చేస్తుండగా సదరు యువతి అత్తమామలు ఆసుపత్రికి చేరుకున్నారు. కోడలిని ఆసుపత్రి బయటికి తీసుకువచ్చి రాళ్లతో, చీపిరితో దాడి చేశారు.

ఈ ఘటనతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వారిని ఆపే ప్రయత్నం చేశారు. అయినా సద్దుమణగ లేదు. ఇంతలో అక్కడికి చేరుకున్న వైద్యురాలిపై కూడా దాడి చేశారు. చేతికి దొరికిన వాటితో కొట్టడం ప్రారంభించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పినా ఇంకా ఎక్కువ చేశారు. అయితే అక్కడున్న కొంతమంది ఈ వీడియోని చిత్రీకరించారు. అది సోషల్ మీడియాలో పెట్టడంతో క్షణాల్లో వైరల్ అయింది. పోలీసులు అక్కడికి చేరుకొని ఘటనపై ఆరా తీశారు. యువతిపై ఎందుకు దాడి చేశారని అత్తమామలను అడిగారు.

Aunty beat the daughter in law

Aunty beat the daughter in law

తమ కోడలు మూడు నెలల గర్భిణీ అని, తమకు తెలియకుండా అబార్షన్ చేయించుకుందని వారు కన్నీరు మున్నీరయ్యారు. కోడలిని ప్రశ్నిస్తే తనకు రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి వచ్చానని చెబుతుంది. దీంతో అటు అత్తా మామలని ఇటు కోడలిని సముదాయించారు. దీంతో గొడవ ఆగిపోయింది. అత్తా కోడళ్ళ మధ్య గొడవలు కామన్ గా జరుగుతుంటాయి. కోడళ్లను మానసికగా వేధించే అత్తలు మనకి కనిపిస్తూనే ఉంటారు. అలాగే అత్తలను ఆపసోపాలకు గురి చేసే కోడళ్లు కూడా ఉంటారు. అయితే అందరూ ఒకేలా ఉండరు. తల్లి కూతుర్ల లాగా ఉండే అత్తా కోడలు కూడా ఉంటారు. అలా ఉంటే ఎటువంటి గొడవలు ఉండవు. కానీ సమాజంలో ఇవన్నీ కామన్.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది