
Auto driver who is learning English a lecturer
Auto Driver : ప్రయివేటు జాబులు ఎంత చేసినా ఆదాయం సరిపోదు. వాళ్లు ఇచ్చే అరకొర జీతాలతోనే ఫ్యామిలీని పోషించాలి. పిల్లల చదువులకు ఇంటి అద్దెకు ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి. దీంతో కొంత మంది పార్ట్ టైం జాబ్ చేస్తారు. మరికొంత మంది టైం సరిపోక అదే జీతాలతో నెట్టుకొస్తారు. అలాంటిదే ఓ సంఘటన ఇప్పుడు చూద్దాం..మనకు కొంచెం అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఏదో ఒక ఆటో పట్టుకుని వెళ్తాం.. టైంకి ఆటో రాకపోతే చిరాకు పడతాం.. అదే బస్ లో వెల్దాం అనుకున్నప్పుడు అరడజను ఆటోలు వచ్చి ఎక్కడి వెళ్లాలి అంటూ అడుగుతుంటారు.. ఇలా అనుకుంటూ అసహనంగా అడుగులేస్తోంది ఒక అమ్మాయి. తనని చూసి పది అడుగుల దూరంలో ఆగిన ఆటోను గమనించి హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకుంది. దగ్గరకి వెళ్లి ఆటో నడిపే వ్యక్తిని చూడగానే ఆటోలో కూర్చోడానికి సంకోచించింది.ఎందుకంటే ఆ ఆటో డ్రైవర్ ఒక ఓల్డ్ మెన్.
అసలు ఈయన నడపగలడా తొందరగా ఆఫీస్ కి వెళ్లగలనా.. అనుకుంది. వెంటనే ఆ ఆటో డ్రైవర్ ప్లీజ్ కమ్ ఇన్ మేమ్.. యూ కెన్ పే ఆజ్ పర్ యువర్ విష్ (దయచేసి లోపల కూర్చోండి మేడం…మీరు ఎంతిచ్చినా సంతోషంగా తీసుకుంటాను అంటూ ) అంటూ పలికిన ఆ తాత మాటలు విని షాక్ అయింది. కాగా ఆ తాత బస్సులను, కార్లను తప్పిస్తూ హుషారుగా నడుపుతున్నాడు ఈ 74 ఏళ్ల పట్టాభి రామన్ ఆటో బెంగుళూర్ రోడ్లలో దూసుకుపోతోంది.అయితే ఇంత వయసులో ఆటో నడిపే అవసరమేమిటి ఈ తతకు.. ఇంగ్లీష్ అంత బాగా మాట్లాడగలుగుతున్నాడు అంటూ అతన్ని ఆడిగేసింది. ఆ తాత స్పందిస్తూ నా పేరు పట్టాభి రామన్. నేను ఎంఏ, ఎంఈడీ చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించాను. వయస్సు పెరిగింది కానీ నిరాశే ఎదురైంది. ఎన్నో ప్రయివేట్ విద్యాసంస్థలలో ఉద్యోగావకాశాలకు ప్రయత్నించాను అని చెప్పుకొచ్చాడు.
Auto driver who is learning English a lecturer
ఎక్కడికెళ్లినా నీ ఏంటని కులం అని ఇంటర్వ్యూ లో అడిగేవారు. కులం తెలుసుకున్నాకా ఏదో ఒక సాకు చెప్పి తిరస్కరించేవారు. ఇక ఎక్కడా ఉద్యోగం రాక విసుగు చెంది బొంబాయికి మకాం మార్చేశానంటూ చెప్పాడు. ఒక ప్రైవేట్ విద్యాసంస్థ నా ప్రతిభను గుర్తించి ఇంగ్లీష్ లెక్చరర్ గా ఉద్యోగమిచ్చిందన్నాడు. బొంబాయిలో కొంచెం జీతంతో ఎన్నో ఖర్చులు. సంపాదనంతా పిల్లలను పెంచి పోషించడానికె ఖర్చు చేశానన్న తృప్తి పదవీవిరమణ సమయానికి మిగిలిందని చెప్పుకొచ్చాడు.ఆయన కథ చెప్పగానే ఆ యువతీ భాదపడుతూ ఫొటో, ఆయన జీవిత కథను నిఖిత అనే అమ్మాయి తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఆ తాత ఔన్నత్వానికి సలాం కొడుతున్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.