Health Problems : వేసవి తాపాన్ని తట్టుకోవడానికి సమ్మర్ లో చాలా మంది వాటర్ మిలన్ ఎక్కువగా తింటారు. పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది. పైగా టేస్టీగా ఉండటంతో పిల్లల నుంచి వృద్ధుల వరకు అంతా వాటర్ మిలన్ ను లాగించేస్తారు. పుచ్చకాయ అనేది కేవలం డీ హైడ్రేషన్ రాకుండా చేయడమే కాకుండా..మనిషికి అవసరమైన శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లను, విటమిన్లను అందిస్తుంది. అందుకే పుచ్చకాయ వేసవిలో అద్భుతమైన ఫ్రూట్ అంటారు. ఎందుకంటే వేసవిలో ఎండల తీవ్రత పెరిగే కొద్దీ ఆకలి తగ్గడం, బాడీలో నీటి శాతం తగ్గిపోవడం వంటివి తలెత్తుతుంటాయి.
సహజసిద్దమైన యాంటీ ఆక్సిడెంట్లకు పుచ్చకాయ ప్రసిద్ధి. ఇందులో లైకోపీన్, ఆస్కార్బిక్ యాసిడ్, సిట్రిలిన్ పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల గుండెపోటు, కేన్సర్ వంటి క్రానిక్ వ్యాధుల్నించి కూడా రక్షించుకోవచ్చు. పుచ్చకాయను ఎలా తీసుకున్నా ఫరవాలేదు. నేరుగా తినవచ్చు లేదా జూస్ చేసుకుని తాగవచ్చు. లేదా ఇతర పండ్లు కీరా, మామిడి, కేరట్, ఆరెంజ్‌తో కలిపి కూడా తీసుకోవచ్చు.అయితే పుచ్చకాయను ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, డయేరియా లేదా కడుపులో ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఫ్రక్టోజ్ అనేది మోనోశాకరైడ్ లేదా సాధారణ చక్కెర, దీని అధిక వినియోగం పొట్టలో ఉబ్బరం కలిగిస్తుంది.
అలాగే పుచ్చకాయ అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) ఆహారం. దీని క్రమరహిత వినియోగం రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. డయాబెటిస్ ఉన్న వారు ఎక్కువగా తీసుకోకుడదు. అలాగే పుచ్చకాయ ఎక్కువగా తీసుకోవడం వలన చర్మం యొక్క రంగు మారుతుంది. దీన్ని లైకోపెనీమియా అని పిలుస్తారు. ఇది ఒక రకమైన కెరోటినిమియా. లైకోపీన్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం పిగ్మెంటేషన్‌లో మార్పులు వస్తాయి.కాగా పుచ్చకాయ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. కానీ ఇందులో చాలా సహజమైన చక్కెర ఉంటుంది. షుగర్ కంటెంట్ అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని నిపుణులు అంటున్నారు.అయితే రాత్రిపూట జీర్ణవ్యవస్థ నెమ్మదిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సమస్య వస్తుంది. అందుకే డే టైంలో తీసుకుంటే ఏం కాదని నైట్ టైంలో మాత్రం అస్సలు తీసుకోకూడదని సూచిస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.