Auto Driver : ఇంగ్లీష్ ఇర‌గ‌దీస్తున్న ఆటో డ్రైవ‌ర్…. ఎందుకంటే ఆయ‌నో లెక్చ‌ర‌ర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Auto Driver : ఇంగ్లీష్ ఇర‌గ‌దీస్తున్న ఆటో డ్రైవ‌ర్…. ఎందుకంటే ఆయ‌నో లెక్చ‌ర‌ర్

 Authored By mallesh | The Telugu News | Updated on :12 April 2022,7:00 am

Auto Driver : ప్ర‌యివేటు జాబులు ఎంత చేసినా ఆదాయం స‌రిపోదు. వాళ్లు ఇచ్చే అర‌కొర జీతాల‌తోనే ఫ్యామిలీని పోషించాలి. పిల్ల‌ల చ‌దువుల‌కు ఇంటి అద్దెకు ఇలా ఎన్నో ఖ‌ర్చులు ఉంటాయి. దీంతో కొంత మంది పార్ట్ టైం జాబ్ చేస్తారు. మ‌రికొంత మంది టైం స‌రిపోక అదే జీతాల‌తో నెట్టుకొస్తారు. అలాంటిదే ఓ సంఘ‌ట‌న ఇప్పుడు చూద్దాం..మ‌న‌కు కొంచెం అర్జెంటుగా వెళ్లాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఏదో ఒక ఆటో ప‌ట్టుకుని వెళ్తాం.. టైంకి ఆటో రాక‌పోతే చిరాకు ప‌డ‌తాం.. అదే బ‌స్ లో వెల్దాం అనుకున్న‌ప్పుడు అర‌డ‌జ‌ను ఆటోలు వ‌చ్చి ఎక్క‌డి వెళ్లాలి అంటూ అడుగుతుంటారు.. ఇలా అనుకుంటూ అసహనంగా అడుగులేస్తోంది ఒక అమ్మాయి. తనని చూసి పది అడుగుల దూరంలో ఆగిన ఆటోను గమనించి హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకుంది. దగ్గరకి వెళ్లి ఆటో నడిపే వ్యక్తిని చూడగానే ఆటోలో కూర్చోడానికి సంకోచించింది.ఎందుకంటే ఆ ఆటో డ్రైవ‌ర్ ఒక ఓల్డ్ మెన్.

అస‌లు ఈయ‌న న‌డ‌ప‌గ‌ల‌డా తొంద‌ర‌గా ఆఫీస్ కి వెళ్ల‌గ‌ల‌నా.. అనుకుంది. వెంట‌నే ఆ ఆటో డ్రైవ‌ర్ ప్లీజ్ కమ్ ఇన్ మేమ్.. యూ కెన్ పే ఆజ్ ప‌ర్ యువర్ విష్ (దయచేసి లోపల కూర్చోండి మేడం…మీరు ఎంతిచ్చినా సంతోషంగా తీసుకుంటాను అంటూ ) అంటూ పలికిన ఆ తాత మాటలు విని షాక్ అయింది. కాగా ఆ తాత‌ బస్సులను, కార్లను తప్పిస్తూ హుషారుగా నడుపుతున్నాడు ఈ 74 ఏళ్ల‌ పట్టాభి రామన్ ఆటో బెంగుళూర్ రోడ్లలో దూసుకుపోతోంది.అయితే ఇంత వయసులో ఆటో నడిపే అవసరమేమిటి ఈ త‌త‌కు.. ఇంగ్లీష్ అంత బాగా మాట్లాడగలుగుతున్నాడు అంటూ అత‌న్ని ఆడిగేసింది. ఆ తాత స్పందిస్తూ నా పేరు పట్టాభి రామన్. నేను ఎంఏ, ఎంఈడీ చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించాను. వయస్సు పెరిగింది కానీ నిరాశే ఎదురైంది. ఎన్నో ప్రయివేట్ విద్యాసంస్థలలో ఉద్యోగావకాశాలకు ప్రయత్నించాను అని చెప్పుకొచ్చాడు.

Auto driver who is learning English a lecturer

Auto driver who is learning English a lecturer

ఎక్కడికెళ్లినా నీ ఏంట‌ని కులం అని ఇంటర్వ్యూ లో అడిగేవారు. కులం తెలుసుకున్నాకా ఏదో ఒక సాకు చెప్పి తిర‌స్క‌రించేవారు. ఇక ఎక్కడా ఉద్యోగం రాక విసుగు చెంది బొంబాయికి మకాం మార్చేశానంటూ చెప్పాడు. ఒక ప్రైవేట్ విద్యాసంస్థ నా ప్రతిభను గుర్తించి ఇంగ్లీష్ లెక్చరర్ గా ఉద్యోగమిచ్చింద‌న్నాడు. బొంబాయిలో కొంచెం జీతంతో ఎన్నో ఖర్చులు. సంపాదనంతా పిల్లలను పెంచి పోషించడానికె ఖర్చు చేశానన్న తృప్తి పదవీవిరమణ సమయానికి మిగిలింద‌ని చెప్పుకొచ్చాడు.ఆయన కథ చెప్పగానే ఆ యువతీ భాదప‌డుతూ ఫొటో, ఆయన జీవిత కథను నిఖిత అనే అమ్మాయి తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. నెటిజ‌న్లు కూడా ఆ తాత ఔన్న‌త్వానికి స‌లాం కొడుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది