Sales | సెప్టెంబర్‌లో ప‌డిపోయిన‌ ఆటోమొబైల్‌ సేల్స్ .. పండుగ సీజన్‌లో పెరుగుతాయ‌నే ఆశ‌లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sales | సెప్టెంబర్‌లో ప‌డిపోయిన‌ ఆటోమొబైల్‌ సేల్స్ .. పండుగ సీజన్‌లో పెరుగుతాయ‌నే ఆశ‌లు

 Authored By sandeep | The Telugu News | Updated on :1 October 2025,7:00 pm

Sales | సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా రిటైల్ ఆటోమొబైల్ విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. వాహన్ పోర్టల్ ద్వారా నమోదైన గణాంకాల ప్రకారం, ఈ నెలలో వాహన రిజిస్ట్రేషన్లు 13.28 శాతం తగ్గినట్టు వెల్లడైంది. అయితే, నెలాఖరు నాటికి వినియోగదారుల ఆసక్తి మళ్లీ పెరగడం, పండుగ సీజన్ ప్రారంభమవ్వడం ఆటోమొబైల్ పరిశ్రమలో నూతన ఆశలను రేకెత్తిస్తోంది.

#image_title

విక్రయాల్లో తాత్కాలిక వెనకడుగు

మంగళవారం (సెప్టెంబర్ 30) మధ్యాహ్నం 2 గంటల వరకు 1.51 మిలియన్ వాహనాలు మాత్రమే నమోదయ్యాయి. ఇది గత ఏడాది ఇదే సమయంలో నమోదైన 1.74 మిలియన్ వాహనాలతో పోలిస్తే 13% తగ్గుదల. అయితే, పరిశ్రమ నిపుణులు చెబుతున్నదాని ప్రకారం, ఇది పూర్తిగా రిజిస్ట్రేషన్ల డేటా మాత్రమే కాగా, అసలు డెలివరీలు ఇంకా లెక్కల్లోకి రాలేదని స్పష్టం చేశారు.

సెప్టెంబర్ మొదటి మూడు వారాల్లో కొనుగోళ్లలో మందగమనం కనిపించింది. దీనికి పితృపక్షాలు, పండుగ ఆఫర్లపై ఎదురు చూపు, జీఎస్టీ రేట్లలో స్పష్టత లేకపోవడం వంటి అంశాలే ప్రధాన కారణాలిగా పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. కానీ నవరాత్రులు ప్రారంభమైన సెప్టెంబర్ 22నుంచి షోరూమ్‌లలో కస్టమర్ల సందడి మొదలైంది.దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, సెప్టెంబర్ 22 నుంచి 25 వరకు కేవలం నాలుగు రోజుల్లోనే 75,000 వాహనాలు విక్రయించగలిగింది. ఇది ఆగస్టులో విక్రయించిన 1.35 లక్షల యూనిట్ల కంటే తక్కువ సమయంలో ఎక్కువ డిమాండ్ ఏర్పడినట్టు సంకేతాలు ఇస్తోంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది