Garikapati : గరికపాటి అసలు బ్రాహ్మణుడే కాదా ? వామ్మో ఇదెక్కడి ట్విస్ట్..!
Garikapati : పది మందిలో ఉన్నప్పుడు, ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నోరును జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాళ్లు ఎంతటి వాళ్లు అయినా సరే.. పది మందిలో నోరు జారితే ఇంకేం ఉంటుంది. పరువు పోతుంది. గరికపాటి నరసింహారావు, మెగాస్టార్ చిరంజీవి వివాదంలో అదే జరిగింది. గరికపాటి నోరు జారారు.. చివరకు క్షమాపణ కూడా చెప్పారు. అయినా కూడా ఈ వివాదం అక్కడితో సమసిపోలేదు. ముఖ్యంగా చిరంజీవి ఫ్యాన్స్ మాత్రం అస్సలు ఊరుకోవడం లేదు. గరికపాటిని ఏకిపారేస్తున్నారు.ఒక్క మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినీ ఇండస్ట్రీ మొత్తం కదిలింది.
అందరూ ముందుకు కదిలి.. గరికపాటిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈనేపథ్యంలో బిగ్ బాస్ ఫేమ్, హేతువాది బాబు గోగినేని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. అది గరికపాటికి సంబంధించిన పోస్ట్. గరికపాటి, చిరంజీవి వివాదం విషయంలో ఆయన ఈ పోస్ట్ చేశారు. గరికపాటి అసలు బ్రాహ్మణుడే కాదు.. అంటూ ఫేస్ బుక్ లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు బాబు గోగినేని. మహా న్యూస్ లో జరిగిన ఓ చర్చావేదిక వీడియోను పెట్టి పోస్ట్ చేశారు గోగినేని. చర్చావేదికలో శాస్త్రి గారెతో పాటు ఓ విశ్లేషకుడు కూడా పాల్గొన్నాడు.
Garikapati : అసలు బ్రాహ్మణులు ఎవరు?
వాళ్లు ఎవరు బ్రాహ్మణుడు అనే దాని గురించి చర్చించారు. అసలు గరికపాటి బ్రాహ్మణుడే కాదు అంటూ ఆ చర్చావేదికలో చర్చించారు. లేదు.. ఆయన బ్రాహ్మణుడు కాబట్టే ఆయన్ను కొందరు సపోర్ట్ చేస్తున్నారని, ఆయన కులాన్ని కాదు చూసేది.. కులజాడ్యం ఇంకా ఈ సమాజం నుంచి పోలేదని శాస్త్రి గారు కామెంట్లు చేశారు. దాని గురించే బాబు కూడా పోస్ట్ పెట్టారు. దాస్ గారు ఎంచక్కగా డాబుసరి మాటకారికి ఉన్న కుల పొగరునూ, బ్రాహ్మణులకు ఎక్కువ బాధ్యత ఉంటుంది అని అంటున్న సహ ప్యానలిస్ట్ కులాభిమానాన్ని ఎలా ఎండ కట్టారో చూడండి. ఈరోజు హేతువాదులకు సెలవు. వీరి లాంటి వారు ఉంటే సమాజానికి, సమానత్వానికి ఎంతో ఉపయోగం. హేతువాదులకు విశ్రాంతి అంటూ గరికపాటి గురించి పోస్ట్ పెట్టారు బాబు గోగినేని.