Chiranjeevi : గరికపాటి వివాదంపై చిరంజీవి ఓపెన్ స్టేట్మెంట్.. తగ్గితే తప్పేంటి?
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కేవలం తెలుగులోనే ఆయనకు క్రేజ్ ఉంది అనుకుంటే పొరపాటే. చిరుకు బాలీవుడ్‌లో కూడా బ్రహ్మరథం పడుతుంటారు .రీసెంట్‌గా చిరు కోసం సల్మాన్ ఖాన్ రూపాయి కూడా తీసుకోకుండా లూసిఫర్ సినిమాలో నటించాడంటే అది తెలుగు ఇండస్ట్రీ గొప్పతనం. టాలీవుడ్‌కు అంత క్రేజ్ తెచ్చిన చిరంజీవి గొప్పతనం అని కూడా చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఏనుగు లాంటి వారు. ఆయన తలుచుకుంటే ఏ పని అయినా ఇట్టే జరిగిపోతుంది. చాలా మంది ఆయన్ను గుడ్డిగా ఫాలో అవుతుంటారు.
ఎందుకుంటే ఆయన కష్టమే ఆయన్ను నేడు ఈ స్థితిలో ఉంచింది. మెగాఫ్యాన్స్ అయితే చిరు కోసం దేనికైనా రెడీ అంటారు. అన్న ఒకసారి ఆర్డర్ వేశాడంటే వారు ఎక్కడి వరకు అయినా వెళ్తుంటారు. కానీ చిరు తెరపై ఎంత ఉగ్రరూపం చూపించినా నిజ జీవితంలో మాత్రం చాలా శాంతంగా ఉంటారు. ఇంట్లోనే కాకుండా బయట కూడా అలానే ఉండేందుకు చిరు ట్రై చేస్తుంటారు. సాధారణంగా వివాదాలకు చిరు గానీ, ఆయన కుటుంబగానీ చాలా దూరంగా ఉంటారు. మెగా కంపౌండ్ నుంచి వచ్చిన వారంతా అదే విధంగా మెయింటెనే చేస్తుంటారు. తమ పనిని తాము చేసుకుంటూ శాంతికాముకులుగా కనిపిస్తారు.
Chiranjeevi : గరికపాటి విషయంలో కావాలనే తగ్గారా..
వెండితెరపై మాత్రం తమ సత్తా చూపిస్తారు. తాజాగా చిరంజీవి ఇటీవల అలయ్ బలయ్ ప్రోగ్రాంలో గరికపాటి నరసింహరావు గారితో జరిగిన వివాదంపై తాజాగా స్పందించారు. ఆయన పేరు తీయకుండా ఇక చాలు దీనిని పెద్దది చేయొద్దంటూ ఫ్యాన్స్‌కు చెప్పారు. గరికపాటి పెద్దవారు ఆయన అన్నదానికి ఇలా ట్రోల్ చేయడం సరికాదు. మనం ఎంత పెద్ద రేంజ్‌లో ఉన్నా కాస్త తగ్గితే తప్పేంటని ప్రశ్నించారు. మన అకౌంట్లో ఎన్ని సున్నాలున్నాయనేది ముఖ్యం కాదు. మనకు దగ్గరగా ఎంత మంది ఉన్నారనేది ముఖ్యమని.. తన తప్పులేకపోతే ఎవరినైనా దగ్గరకు తీసుకుంటానని చిరు చెప్పారు.