Bairi Naresh comments about Yerravaram Bala Ugra Narasimha Swamy Temple
Bairi Naresh : తెలంగాణలో ఉన్న ఎర్రవరం బాలఉగ్రలక్ష్మీనరసింహస్వామి ఆలయం గురించి ప్రముఖ నాస్తికుడు బైరి నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ దగ్గరలోని ఎర్రవరం అనే గ్రామంలో ఒక గుట్టపై బాల ఉగ్ర నరసింహ స్వామి వెలిశాడని, ఆలయానికి వెళ్లి ఏం కోరుకుంటే అది జరుగుతుందని అక్కడి భక్తులు నమ్ముతున్నారు. అంతేకాకుండా అక్కడ పండు అనే బాలుడిపై ఉగ్ర నరసింహ స్వామి పూనడంతో అతడు ఏం చెబితే అది జరుగుతుందని చెబుతున్నారు. ఆ బాలుడు అక్కడ గుట్ట పైన బాల ఉగ్ర నరసింహ స్వామి వెలిశాడని చెప్పడంతో ఆ ఊరి ప్రజలంతా అక్కడికి వెళ్లి చూశారు. నిజంగానే గుట్టపై దేవుడు వెలిశాడని ప్రజలు పూజలు చేయడం ప్రారంభించారు.
అలాగే చాలా మంది తమ కోరికలు నెరవేరాయని కూడా చెప్పారు. అక్కడికి వెళ్లి ఏం కోరుకుంటే అది జరుగుతుందని చెప్పడంతో అది కాస్త వైరల్ అయింది. దీంతో చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలే కాదు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు బాల ఉగ్ర నరసింహ స్వామి దర్శించుకోవడానికి వెళుతున్నారు. ప్రతిరోజు అక్కడ లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే ఆ గుడిపై ప్రముఖ నాస్తికుడు బైరి నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు అక్కడ దేవుడు అనేది లేదన్నారు. బాల ఉగ్ర నరసింహ స్వామి అనేది అంతా బూటకం అన్నారు.
Bairi Naresh comments about Yerravaram Bala Ugra Narasimha Swamy Temple
పండు అనే వాడు నరసింహస్వామి అవతారం ఎత్తి రెండు నెలలు అవుతుంది. మరి మూడో నెల ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అంటూ బైరి నరేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాగే భర్తతో కాపురం చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుందా లేక ఆ పండు స్వామి చెప్పాడని ప్రెగ్నెంట్ రావడం ఏంటి అని ప్రశ్నించారు. అలాగే ఇంకా చాలామంది గుడికి వచ్చాక నాకు క్యాన్సర్ తగ్గిపోయిందని, నాపై ఉన్న కేసులు అన్ని తొలగిపోయాయని చెబుతున్నారు. మీరు ఎప్పటినుంచో ఆ కేసు గురించి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇప్పుడు అది సాల్వ్ అయింది. అంతేకానీ దేవుడు ఏం చేయలేదు అని అన్నారు. వంద ఛానల్స్ ఆ ఉగ్ర నరసింహ స్వామి గురించి చెప్పారు కానీ తెర వెనుక అసలు ఏం జరుగుతుందో చెప్పరు.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.