Akhanda 2 | బాలకృష్ణ ‘అఖండ 2’ విడుదల తేదీపై క్లారిటీ..డిసెంబర్ 5న థియేటర్లలో సందడి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Akhanda 2 | బాలకృష్ణ ‘అఖండ 2’ విడుదల తేదీపై క్లారిటీ..డిసెంబర్ 5న థియేటర్లలో సందడి

 Authored By sandeep | The Telugu News | Updated on :25 September 2025,2:00 pm

Akhanda 2 | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2’ ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. మొదట ఈ చిత్రం పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమాతో సమానంగా రిలీజ్ చేయాలని మేకర్స్ యోచించినా, నిర్మాణంలో ఆలస్యం కారణంగా విడుదల వాయిదా వేసుకున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వెలువడింది.

#image_title

క్లారిటీ ఇచ్చారు..

పవన్ కళ్యాణ్ OG ప్రీమియర్ షోలో ‘అఖండ 2’ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 5, 2025న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల ముందుకు రానుంది. OG ప్రింట్స్‌తో పాటు ఓ స్పెషల్ టీజర్‌ను జతచేసి ఈ తేదీని ప్రకటించడంతో నందమూరి అభిమానుల్లో ఆనందం వెల్లివిరిచింది.

ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తుండగా, ఆది పినిశెట్టి ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలీ మల్హోత్రా ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది.14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీనాథ్ అచంట ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, ఎం.తేజస్విని నందమూరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సునీతంగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది