Krishnapatnam Anandayya : ఆనందయ్య మందుపై బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్?
Krishnapatnam Anandayya : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రముఖంగా వినిపిస్తున్న పేరు కృష్ణపట్నం ఆనందయ్య. ఆ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతా మారుమోగిపోతోంది. ఎందుకంటే.. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాకు ఆయన ఆయుర్వేదంలో మందు కనిపెట్టారు. ఆ మందు కూడా బ్రహ్మాండంగా కరోనా మీద పని చేస్తోంది. దీంతో అందరూ ఆమందు కోసం ఎగబడ్డారు. వేల మంది ఆ మందును తీసుకొని బాగుపడ్డారు. ఆ మందును తీసుకున్న వాళ్లకు కరోనా తగ్గింది. కరోనా రానివాళ్లు ఆ మందు తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరిగి కరోనా వ్యాప్తి చెందకుండా అడ్డుకోగలిగారు. ఆక్సిజన్ లేవల్స్ తగ్గిన వాళ్లకు కూడా జస్ట్ 5 నిమిషాల్లో ఆక్సిజన్ లేవల్స్ ను పెంచే బ్రహ్మాండమైన కంటి మందును కూడా ఆనందయ్య తయారు చేశారు. నిజంగా ఈసమయంలో ఇటువంటి మందు రావడం అనేది ప్రజలు చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి. అయితే.. ప్రస్తుతం ఆ మందుపై టెస్టులు జరుగుతున్నాయి. టెస్టుల రిపోర్టులు వచ్చేదాక.. మందు పంపిణీ చేయకూడదని.. ప్రభుత్వం మందు పంపిణీని ఆపేసింది.

balakrishna on krishnapatnam anandayya ayurvedic medicine
అయితే.. ఆనందయ్య తయారు చేసిన ఈ మందుపై చాలామంది పాజిటివ్ గా స్పందించారు. ఈ మందును వేసుకున్న వాళ్లు కూడా ఆ మందు తమకు బాగా పనిచేసిందని.. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని.. కరోనా చివరి స్టేజీలో ఉన్నా కూడా ఆ మందు వేసుకుంటే తమకు తగ్గిందంటూ చెబుతున్నారు. సినిమా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు కూడా ఆనందయ్య కరోనా మందుకు మద్దతు పలికారు. ఈసందర్భంలో ఆనందయ్య మందుపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఆయన మందు గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.
Krishnapatnam Anandayya : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ
ఇవాళ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తండ్రికి నివాళులు అర్పించి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులు.. ఆనందయ్య కరోనా మందు గురించి బాలకృష్ణ వద్ద ప్రస్తావించగా… బాలకృష్ణ ఆ మందు గురించి ఏమన్నారంటే.. నాకైతే ఆనందయ్య మందు మీద నమ్మకం ఉంది. ఎందుకంటే.. అభిమానం లేకుంటే ఆరాధన ఉండదు. ఆరాధన లేకుంటే మతం ఉండదు. మతం లేకుంటే మనిషే ఉండడు. అదే విధంగా.. ప్రతిది కూడా ఒక నమ్మకమే. నేను అయితే ఖచ్చితంగా నమ్ముతాను. భారతదేశంలో ఎందరో గొప్ప వైద్యులు ఉన్నాయి. నిజానికి.. క్రీస్తు పూర్వమే సుశ్రుతుడు అనే వైద్యుడు ఉండేవాడు. ఆ కాలంలో ఆయన గొప్ప సర్జన్. అలాంటి వారిని మనం ఇప్పుడు మరిచిపోయాం. ఎక్కడో ఆస్ట్రేలియాలోనే ఆయన పేరు ఇప్పటికీ చెరిగిపోకుండా ఉంది.. అంటూ ఆనందయ్య మందుపై పాజిటివ్ గా స్పందించారు బాలకృష్ణ.