Bald Head : మీకు బట్టతల ఉందా? ఈ పని చేశారంటే మీరు వద్దన్నా కూడా తలపై జుట్టు మొలుస్తుంది..!
Bald Head : బాల్డ్ హెడ్.. దాన్నే మనం బట్టతల అంటాం. ఈ సమస్య చాలామందిని వేధిస్తుంటుంది. బట్ట తల ఉన్నవాళ్లు చాలా ఇబ్బందులు పడుతుంటారు. బయటికి రావాలంటేనే దడుసుకుంటారు. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్లు అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. బట్ట తల ఉన్న అబ్బాయిలను ఎవ్వరూ పెళ్లి చేసుకోరు కదా. వాళ్లు పడే బాధలు వర్ణణాతీతం. వయసు మళ్లిన వాళ్లలో బట్ట తల వస్తే పెద్దగా ప్రమాదం ఏం లేదు కానీ.. చిన్న వయసులోనే బట్ట తల వస్తే మాత్రం చాలా కష్టం.
బట్ట తల వచ్చిన వాళ్లు.. బట్ట తల పోవడానికి.. తలపై జుట్టు మొలవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్నో ట్రై చేస్తారు. మెడిసిన్స్ వాడుతారు. కానీ.. బట్ట తల మాత్రం పోదు. లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అయితే… బట్టతలను పోగొట్టడానికి ఆయుర్వేదంలో మంచి మందు ఉంది. మన వంటింట్లో ఉండే వస్తువులతో ఎన్నో సమస్యలను పోగొట్టవచ్చు అని తెలుసు కదా. మనం రోజూ చూసే దీనితో బట్టతలను శాశ్వతంగా నిర్మూలించవచ్చు.
Bald Head : మామిడి టెంకను ఇలా చేస్తే బట్ట తల మాయం అవ్వాల్సిందే?
మీకు మామిడి టెంక తెలుసు కదా. మామిడి పండును తిన్నాక వచ్చే టెంక. దాన్ని పగలగొట్టితే అందులో జీడి ఉంటుంది. మామిడి టెంక చాలా గట్టిగా ఉంటుంది. దాన్ని పగలగొట్టి.. అందులోని జీడి తీసి.. ఆ జీడిని ఎండబెట్టాలి. జీడి ఎండాక.. దాన్ని పొడిగా చేసి.. తలకు రాసే ఏదైనా నూనెలో కలిపి బాగా మరగబెట్టాలి. ఆ తర్వాత ఆ నూనెను చల్లార్చి రోజూ తలకు రాస్తూ ఉంటే.. త్వరలోనే బట్ట తల మీద జుట్టు వస్తుంది. అలాగే.. జుట్టు ఊడిపోవడం కూడా తగ్గుతుంది. చుండ్రు లాంటి సమస్యలు ఉన్నా తగ్గుతాయి. తెల్ల జుట్టు ఉన్నవాళ్లు కూడా ఈ విధంగా చేస్తే తెల్ల జుట్టు మటుమాయం అవుతుంది.
ముఖంపై మచ్చలు ఉన్నా… మొటిమలు ఉన్నా.. జీడి గింజల పొడిని రుద్దుకోవాలి. పొడిని వెన్నతో కలిపి ముఖం మీద రాసుకుంటే.. చర్మం మృదువుగా మారుతుంది. ఆరోగ్యకరంగా అవుతుంది. ఆవ నూనెతో కలిపి ముఖంపై రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
మామిడి జీడి పొడిని తినవచ్చు కూడా. పొడిని తేనెతో కలిపి.. ఒక గ్రాము తీసుకుంటే.. విరోచనాలు తగ్గుతాయి. బీపీ కంట్రోల్ లో ఉంటుంది. గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. మధుమేహం ఉన్న వాళ్లు కూడా జీడి గింజలను తినొచ్చు. అయితే.. మామిడి జీడి పొడిని మోతాదుకు మించి తినకూడదు. ఎక్కువ తింటే లేనిపోని సమస్యలు వస్తాయి. రోజుకు ఒక గ్రాము పొడి కంటే ఎక్కువ తినకూడదు.