Super Foods : ఖర్చు తక్కువ లాభం ఎక్కువ అనేలా ఈ సూపర్ ఫుడ్స్.. నిజంగా ఆరోగ్యానికి ఖజానాలే అవేంటో తెలుసా?
ప్రధానాంశాలు:
Superfoods: ఖర్చు తక్కువ లాభం ఎక్కువ అనేలా ఈ సూపర్ ఫుడ్స్.. నిజంగా ఆరోగ్యానికి ఖజానాలే అవేంటో తెలుసా?
Super Foods : ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన డైట్‌లు విదేశీ సూపర్ ఫుడ్స్ తప్పనిసరి అనే భావన ఇప్పుడు మారుతోంది. మన ఇంటి దగ్గర మార్కెట్లోనే రోజూ మనం చూసే సాధారణ ఆహారాల్లోనే అద్భుతమైన పోషక విలువలు దాగున్నాయి. ముఖ్యంగా రూ.10 లోపే దొరికే కొన్ని ఆహారాలు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లను అందించి అనేక రోగాల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఖర్చు తక్కువ లాభం ఎక్కువ అనేలా ఈ సూపర్ ఫుడ్స్ నిజంగా ఆరోగ్యానికి ఖజానాలే. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Superfoods: ఖర్చు తక్కువ లాభం ఎక్కువ అనేలా ఈ సూపర్ ఫుడ్స్.. నిజంగా ఆరోగ్యానికి ఖజానాలే అవేంటో తెలుసా?
Super Foods: చవక ధరలో పోషక బలం ఇచ్చే ఆకుకూరలు
పాలకూర, తోటకూర, చుక్కకూర వంటి ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. రక్తహీనత సమస్య ఉన్నవారికి ఇవి ఎంతో ఉపయోగకరం. రోజూ కొద్దిగా ఆకుకూరలు తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య తగ్గుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇవి సీజన్‌ను బట్టి 5 నుంచి 10 రూపాయల లోపే సులభంగా లభిస్తాయి. ఖరీదైన సప్లిమెంట్స్ అవసరం లేకుండా సహజంగానే ఆరోగ్యం అందించే ఆహారం ఇదే.
Super Foods: శక్తినిచ్చే ప్రోటీన్ ఆహారాలు
వేరుశెనగలు ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులకు మంచి మూలం. రోజూ కొద్దిగా వేరుశెనగలు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. అలాగే మొలకెత్తిన శనగల్లో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండటంతో మధుమేహం ఉన్నవారికి ఇవి ఎంతో ప్రయోజనకరం. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. ఉడికించిన గుడ్డు కూడా తక్కువ ఖర్చుతో లభించే ఉత్తమ ప్రోటీన్ ఫుడ్. కండరాల బలం శరీర ఎదుగుదలకు ఇది చాలా అవసరం. చాలా ప్రాంతాల్లో ఒక గుడ్డు రూ.10 లోపే దొరుకుతుంది. అరటిపండు కూడా శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే ఆహారం. పొటాషియం ఎక్కువగా ఉండటంతో అలసట కండరాల నొప్పులు తగ్గుతాయి.
Super Foods: రోగనిరోధక శక్తిని పెంచే సహజ ఔషధాలు
వెల్లుల్లిని రోజూ ఆహారంలో చేర్చుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది రక్తపోటు కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయపడుతుంది. నిమ్మకాయలో విటమిన్ C పుష్కలంగా ఉండటంతో జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరమవుతాయి. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే శరీరం డీటాక్స్ అవుతుంది. ఈ రెండూ చాలా తక్కువ ధరలోనే లభిస్తాయి. రోజూ కొంతమొత్తంలో వీటిని తీసుకుంటే ఆరోగ్యం కాపాడుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన ఆహారాలే అవసరం అన్న అపోహను వదిలేయాలి. మన చుట్టూ ఉన్న సాధారణ చవక ఆహారాలే నిజమైన సూపర్ ఫుడ్స్. వీటిని సమతుల్యంగా రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డైట్ మార్పులు చేసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.