Bandi Sanjay : హమ్మయ్య… నాగార్జున సాగర్ ఉపఎన్నిక ప్రచారం అయితే ముగిసింది. ఇక మిగిలింది ఎన్నికలే. ఈనెల 17న సాగర్ ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. అన్ని పార్టీలు అయితే ప్రచారాన్ని జోరుగా సాగించి ముగించాయి. నాగార్జునసాగర్ లో బలంగా ఉన్న ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే… బీజేపీ ఈసారి ఎన్నికల ప్రచారంలో జోరు పెంచింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు… తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బండి సంజయ్ గురించి తెలిసిందే కదా. ఆయన మాట్లాడితే మామూలుగా ఉండదు. అసలే ఎన్నికల ప్రచారం.. ఇంకెలా ఉంటది… సాగర్ ఉపఎన్నిక ప్రచారం చివరి రోజును బండి సంజయ్ రెచ్చిపోయారు. అధికార పార్టీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ప్రచారం చివరి రోజున బీజేపీ తరుపున.. బండి సంజయ్ తో పాటు విజయశాంతి, మాజీ ఎంపీ వివేక్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్… మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడ ఉన్నావ్. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు… అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో? బండి సంజయ్ ఎవరో తెలియదు అని అంటున్నావు కదా… నీ అయ్యను అడుగు… బండి సంజయ్ ఎవరో చెబుతాడు… అంటూ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మంత్రి కేటీఆర్ పై విరుచుకుపడ్డారు..
కేవలం ఇద్దరు ఎంపీలు ఉన్న టీఆర్ఎస్ పార్టీ.. తెలంగాణను తెచ్చిందా? పార్లమెంట్ లో సుష్మా స్వరాజ్… తెలంగాణకు మద్దతు ఇచ్చారు… ఆ విషయం మీకు గుర్తు లేదా? కేంద్రం ఇచ్చిన నిధులతోనే తెలంగాణలోని గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోంది. కేంద్రం అభివృద్ధి చేయాలంటూ డబ్బులు ఇస్తే.. కేసీఆర్ మాత్రం పెగ్గులు వేస్తున్నాడు. సాగర్ లో అభివృద్ధి మాత్రం చేయలేదు. కేంద్రం తెలంగాణకు ఎన్ని కోట్లు ఇచ్చిందో అన్ని లెక్కలు నా దగ్గర ఉన్నాయి.. అన్నీ చెబుతా. కేంద్రం నిధులతో మరుగు దొడ్లను నిర్మిస్తే… వాటిపై కేసీఆర్ బొమ్మలు పెట్టుకున్నారు. ఈనెల 17న ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. కేసీఆర్ అవినీతి, అక్రమాలు అన్నీ బయటపెట్టి జైలుకు పంపిస్తాం.. అని బండి సంజయ్ హెచ్చరించారు.
బీజేపీ సాగర్ అభ్యర్థి రవి కుమార్ నాయక్.. పేద బిడ్డ. బీజేపీ అంటేనే బడుగు, బలహీన వర్గాల పార్టీ. ఇక్కడ పేదోళ్లకు… పెద్దలకు మధ్య జరుగుతున్న పోరు ఇది. ప్రజలు ఎటు ఉంటారో ఆలోచించుకోండి. టీఆర్ఎస్ నేతలు అయితే సాగర్ లో ఎక్కడ చూసినా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. దుబ్బాకలో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో యువత తమ సత్తా చాటింది. అలాగే సాగర్ కూడా మీ సత్తా చాటండి… రవి నాయక్ ను గెలిపించండి.. ఆ తర్వాత హాలియాలో విజయోత్సవ సభను నిర్వహించుకుందాం.. అని బండి సంజయ్ సాగర్ ప్రజలను కోరారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.