Bandi Sanjay : బండి సంజయ్ గురించి తెలుసు కదా. ముక్కుసూటితనం. ఏది ఉన్నా వెంటనే అనేస్తారు. ఏమాత్రం ముందూ వెనకా ఆలోచించరు. ఎదుటివాళ్లు ఎంతటి వాళ్లు అయినా సరే… విమర్శించడమే. అందుకే తెలంగాణలో ఆయన ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటారు. ఆయన ఏం మాట్లాడినా అది సంచలనమే అవుతుంది. అందులోనూ బీజేపీ తెలంగాణలో తన దూకుడును పెంచింది. రాజకీయంగా సీఎం కేసీఆర్ టార్గెట్ చేయడానికి వాళ్లకు ఏది దొరికితే దాన్ని పట్టుకుంటున్నారు. దేన్నీ వదలడం లేదు. అందుకే బీజేపీ నేతలు కానీ… బండి సంజయ్ కానీ తెలంగాణలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతున్నారు.
ఆదివారం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఎప్పటిలాగానే బండి సంజయ్… ఈసారి కూడా సీఎం కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. ఆయన్ను టార్గెట్ చేస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్యోతిరావు పూలే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేశారని…. ఆయన ఆశయాలను నెరవేర్చేందుకే బీజేపీ కృషి చేస్తోందన్నారు.
బీసీ అంటే బాయ్ కాట్ చంద్రశేఖర్ రావు అనే నినాదంతో బీసీలంతా ఐక్యంగా ఉద్యమించాలి. ఎందరో మహనీయుల చరిత్రనే కనుమరుగు చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారు. తెలంగాణ క్యాబినేట్ లో ఎంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు.. ఉన్న ఇద్దరు ముగ్గురు బీసీ మంత్రులు కూడా కేసీఆర్ మోచేతి నీళ్లు తాగేవాళ్లే. పేదల కోసం, మహిళల కోసం జ్యోతిరావు పూలే ఎలా పోరాటం చేశారో….. ఇప్పుడు దళితులు, బహుజనుల కోసం మోదీ ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. బీసీ వర్గానికి చెందిన మోదీని ప్రధానిని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుంది. జ్యోతిరావు పూలే లాంటి మహనీయులకు నివాళులు అర్పించాలి… కనీస గౌరవం ఇవ్వాలని కూడా ఈ ముఖ్యమంత్రికి తెలియదు. ఖాళీగానే ఉంటారు కానీ… మహనీయులకు నివాళులు అర్పించరు… అని బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు.
Allu Arjun Biggest Cutout : పుష్ప 1 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప…
Cashews : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిలలో జీడిపప్పు కూడా ఒకటి. అయితే ఇది మన ఆరోగ్యానికి…
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉందా.. అదేంటి ఆమె లవ్ లో పడ్డ మ్యాటర్…
Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో…
Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…
CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 98 పోస్టుల…
Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్సి అన్నారు.…
This website uses cookies.