Bandla Ganesh : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి తెలుగు సినీ ఇండస్ట్రీ నిర్మాత బండ్ల గణేష్ కూడా విచ్చేశారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం బండ్ల గణేష్ మీడియా ముందుకు వచ్చి మీడియాతో ముచ్చటించటం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అలాగే రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని అనుకున్న వారిలో బండ్ల గణేష్ ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇప్పుడు నేను అనుకున్నది జరగడంతో తాను ఎంతో సంతోషంగా ఉన్నానని మీడియాకు వెల్లడించారు.
ఈ క్రమంలోనే మీడియా మిత్రులు రేవంత్ రెడ్డి గారి ప్రమాణస్వీకారం చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అని అడగగా దసరా, దీపావళి సంక్రాంతి, క్రిస్మస్ , రంజాన్ అన్ని పండుగలు ఒకేసారి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అంటూ బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. అలాగే రేవంతన్న పరిపాలనలో ప్రజలందరూ ఆనందంగా ఉంటారని , రేవంత్ రెడ్డి అన్న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా కిక్కు ఉందంటూ చెప్పుకొచ్చాడు. అనంతరం ఓ జర్నలిస్టు పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో.. రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం కూడా అంతే ఎదురు చూశారా అంటూ అడిగాడు. . దానికి బండ్ల గణేష్ సమాధానం ఇస్తూ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని నా ఆశ శ్వాస దాస అంటూ చెప్పుకొచ్చాడు.
అలాగే నేను కాంగ్రెస్ కి చాలా పెద్ద అభిమానిని. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంగా పోటీ చేసినప్పుడు సక్సెస్ కాలేకపోయారని ఇప్పుడు రేవంత్ రెడ్డి అయ్యారని అప్పుడు కూడా అందరం చాలా కష్టపడ్డామని, కానీ ఈసారి రేవంత్ రెడ్డి అనుగ్రహంతో అధికారంలోకి వచ్చామని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉందంటూ బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు.అనంతరం జర్నలిస్టు మీ కార్నర్స్ పార్టీలో ఎన్నో రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయని అగ్రనేతలు చాలామంది అసంతృప్తిగా ఉన్నారని, దీనిపై ఏమైనా అడ్డంకులు వచ్చే అవకాశం ఉందా అని అడగగా.. దానికి సమాధానంగా బండ్ల గణేష్ నీ కొడుకుని నా కొడుకని చెబితే నమ్ముతారా సార్ అంటూ సమాధానం ఇచ్చాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.