Bathukamma Sambaralu | తెలంగాణలో బతుకమ్మ సంబరాలు.. సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు వైభవంగా ఉత్సవాలు
Bathukamma Sambaralu | తెలంగాణ సంస్కృతి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా జరపనుంది. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు వివిధ జిల్లాల్లో ఉత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 21న వరంగల్ జిల్లాలోని వేయి స్తంభాల గుడి వద్ద బతుకమ్మ వేడుకలు ప్రారంభం. సెప్టెంబర్ 30న హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్‌తో ముగింపు.

#image_title
పూర్తి షెడ్యూల్ ఇలా:
సెప్టెంబర్ 21:
ఉదయం: హైదరాబాద్ శివారులో మొక్కలు నాటే కార్యక్రమం
సాయంత్రం: వరంగల్ వేయ్యి స్తంభాల గుడిలో ప్రారంభ వేడుకలు
సెప్టెంబర్ 22:
హైదరాబాద్ శిల్పారామం, మహబూబ్‌నగర్ జిల్లా పిల్లలమర్రి
సెప్టెంబర్ 23:
నాగార్జునసాగర్ బుద్ధవనం
సెప్టెంబర్ 24:
కాళేశ్వరం ముక్తేశ్వరాలయం (జయశంకర్ జిల్లా)
కరీంనగర్ ఐటీ సెంటర్
సెప్టెంబర్ 25:
భద్రాచలం ఆలయం, అలంపూర్ (జోగులాంబ గద్వాల జిల్లా)
అదేరోజు నుంచి 29 వరకు హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో బతుకమ్మ ఆర్ట్ క్యాంప్
సెప్టెంబర్ 26:
అలీసాగర్ రిజర్వాయర్ (నిజామాబాద్), అదిలాబాద్, మెదక్ జిల్లాల్లో వేడుకలు
ఉదయం హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో సైకిల్ ర్యాలీ
సెప్టెంబర్ 27:
ఉదయం ట్యాంక్ బండ్‌లో మహిళల బైక్ ర్యాలీ
సాయంత్రం ఐటీ కారిడార్‌లో బతుకమ్మ కార్నివాల్
సెప్టెంబర్ 28:
ఎల్బీ స్టేడియంలో 10,000కుపైగా మహిళలతో బతుకమ్మ వేడుకలు
50 అడుగుల ఎత్తు బతుకమ్మ అలంకారం
గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నం
సెప్టెంబర్ 29:
పీపుల్స్ ప్లాజాలో బతుకమ్మ పోటీలు
డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో సరస్ ఫెయిర్
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆర్‌డబ్ల్యూఏలు, హైదరాబాద్స్ సాఫ్ట్‌వేర్ సంస్థల ఆధ్వర్యంలో పోటీలు
సెప్టెంబర్ 30:
ట్యాంక్‌బండ్‌లో గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్
వింటేజ్ కారు ర్యాలీ, ఇకెబానా ప్రదర్శన, జపాన్ సంస్కృతిక ప్రదర్శన
సెక్రటేరియట్ భవనం పై 3డీ లేజర్ మాపింగ్ షోతో వేడుకలకు ముగింపు