Sweeper : వామ్మో ఈ స్వీపర్‌ జీతం రూ.2లక్షలు .. ఇంతలా ఎలా పెరిగిందో తెలుసా ..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: February 26, 2026, 11:00 am
  •  Sweeper : వామ్మో ఈ స్వీపర్‌ జీతం రూ.2లక్షలు .. ఇంతలా ఎలా పెరిగిందో తెలుసా ..!

Sweepers : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరిగినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు. ప్రత్యేకంగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఒక సీనియర్ స్వీపర్‌కు నెలకు సుమారు రూ.2 లక్షల వరకు జీతం అందుతోందని తెలిపారు. వరుసగా అమలైన పీఆర్‌సీలు PRCలు కారణంగానే ఈ స్థాయికి వేతనాలు పెరిగాయని ఆయన వివరించారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతన వ్యవస్థలో జరిగిన మార్పులు, సవరణలు, ఫిట్‌మెంట్‌లు కలిసి ఈ పెరుగుదలకు దారితీశాయని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు తర్వాత పలు దఫాల్లో వేతన సవరణలు అమలు చేయడం వల్ల ఉద్యోగుల ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్పారు. ప్రతి పీఆర్‌సీ ద్వారా ప్రాథమిక వేతనాలు పెరగడంతో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ వంటి భత్యాలు కూడా పెరిగాయని వివరించారు.

Sweeper salary in Telangana is Rs. 2 lakhs

Sweeper : వామ్మో ఈ స్వీపర్‌ జీతం రూ.2లక్షలు .. ఇంతలా ఎలా పెరిగిందో తెలుసా ..!

ముఖ్యంగా దీర్ఘకాలంగా సేవలందిస్తున్న సిబ్బందికి వార్షిక వేతన వృద్ధులు, ప్రమోషన్లు కలిసివచ్చి జీతాలు భారీ స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం కూడా పెరిగిందని స్పష్టం చేశారు. తాజాగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చించామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం ప్రతి నెలా సుమారు రూ.6 వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన 2014లో ఈ వ్యయం కేవలం రూ.1,500 కోట్ల వరకు మాత్రమే ఉండేదని గుర్తుచేశారు. పదేళ్ల వ్యవధిలో ఈ వ్యయం నాలుగు రెట్లు పెరగడం గమనార్హమన్నారు. పెరుగుతున్న వ్యయాలను సమర్థంగా నిర్వహించేందుకు ఆర్థిక క్రమశిక్షణ అవసరమని అధికారులకు సూచించారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp