Beetroot juice | బీట్‌రూట్ ఎక్కువ తీసుకోవడం వలన ఆ ప్రాణాంతక వ్యాధి వస్తుందా?
Beetroot juice | బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల హేమోగ్లోబిన్ స్థాయి మెరుగవుతుందని నమ్మకం. కాలేయం, గుండె ఆరోగ్యానికి, ఇంకా చర్మం మెరుగు పడటానికి ఇది సహాయపడుతుంది. రోజూ తాగితే ముఖం ప్రకాశవంతంగా మారుతుందని కూడా చెబుతారు. బీట్‌రూట్ జ్యూస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

#image_title
అధిక ఆమ్లత్వం
బీట్‌రూట్ జ్యూస్ ఆమ్లత ఎక్కువగా కలిగి ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలకు, ఉబ్బరం, గ్యాస్, కొన్ని సందర్భాల్లో విరేచనాలకూ కారణమవుతుంది.
జుట్టు రాలే ప్రమాదం
బీట్‌రూట్‌లో ఉండే ఆక్సలేట్‌లు – జింక్ శోషణను తగ్గిస్తాయి. ఫలితంగా జింక్ లోపం వచ్చి జుట్టు రాలే ప్రమాదం ఉంటుంది.
బీపీ తగ్గిపోవచ్చు
బీట్‌రూట్ రసం రక్తపోటును తగ్గించే గుణం కలిగి ఉంటుంది. ఇది హై బీపీ ఉన్నవారికి మంచిదైనా, తక్కువ బీపీ ఉన్నవారు తాగితే ప్రమాదమే. బీపీ సడెన్‌గా పడిపోయి స్పృహ కోల్పోవచ్చు.
షుగర్ లెవల్స్ పెరగడం
బీట్‌రూట్‌లో సహజ చక్కెర ఉంది. ఫైబర్ లేకుండా జ్యూస్ రూపంలో తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయి పెరిగే అవకాశం ఉంది. డయాబెటిస్ ఉన్నవారు ఈ విషయం జాగ్రత్తగా గమనించాలి.
కిడ్నీలో రాళ్ళు
బీట్‌రూట్‌లో ఆక్సలేట్‌లు అధికంగా ఉండటం వల్ల, శరీరంలోని కాల్షియంతో కలసి మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి.
క్యాన్సర్ ప్రమాదం
బీట్‌రూట్‌లో ఉన్న నైట్రేట్లు, ఎక్కువ మోతాదులో తీసుకుంటే, కడుపు ఆమ్లంతో కలసి హానికరమైన N-nitroso సమ్మేళనాలను రూపొందించే ప్రమాదం ఉంది. ఇవి క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదాన్ని పెంచుతాయన్న పరిశోధనలు ఉన్నాయి.