Skin | నలభై ఏళ్ల వయసులో చర్మాన్ని కాంతివంతంగా ఉంచే జ్యూస్‌లు .. ఇవి తాగితే..!
Skin | చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన ఆహారం అత్యంత కీలకం. ముఖ్యంగా నలభై ఏళ్ల వయసు తర్వాత శరీరంలో హార్మోన్ల మార్పులు, జీవనశైలి ప్రభావం వల్ల చర్మంపై ముడతలు, పొడిబారడం, పాలిపోయిన కాంతి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ పరిస్థితిలో ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా ఉంచుకోవచ్చు.

#image_title
చాలా ఉపయోగాలు..
వైద్య నిపుణుల సూచన ప్రకారం బీట్‌రూట్, క్యారెట్, ఉసిరి జ్యూస్ చర్మానికి సహజ కాంతిని అందిస్తాయి. ఈ జ్యూస్‌లను ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా చర్మ సమస్యలు తగ్గడమే కాకుండా శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. ముఖ్యంగా బీట్‌రూట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను రక్షిస్తాయి. క్యారెట్‌లో ఉండే బీటాకెరోటిన్ చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది.
ఉసిరి విటమిన్ C సమృద్ధిగా కలిగి ఉండటం వల్ల కొల్లాజన్ ఉత్పత్తి పెరిగి ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ జ్యూస్‌లను ఎల్లప్పుడూ ఖాళీ కడుపుతో తాగడం మరింత మేలని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే చర్మం కాంతివంతంగా మారడమే కాకుండా టాక్సిన్లు బయటకు వెళ్లేందుకు కూడా దోహదం చేస్తుంది. అదేవిధంగా ముఖంపై ముడతలు తగ్గడం, చర్మం మెత్తగా మారడం వంటి ప్రయోజనాలు కూడా పొందవచ్చు.