Beetroot puri : పిల్లలు సైతం ఇష్టపడే బీట్రూట్ పూరి… ఇలా చేసి చూడండి
Beetroot puri : బీట్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందో అందరికీ తెలుసు. కానీ చాలామంది బీట్రూట్ తినడానికి ఎక్కువగా ఇష్టపడరు. కొంతమంది అయితే వాటి జోలికి పోరు. పిల్లలు కూడా వాటిని అసలు ఇష్టపడరు. అయితే ఎంతో ఆరోగ్యకరమైన బీట్రూట్ ని పూరి లాగా చేసుకుని తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది. అయితే ఇప్పుడు బీట్రూట్ పూరిని ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు : 1) బీట్రూట్ 2) పచ్చిమిర్చి 3)అల్లం 4) ఉప్పు 5) సోంపు 6) గోధుమపిండి 7) ఆయిల్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మీడియం సైజ్ కప్పు బీట్రూట్ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు, అర టీ స్పూను సోంపు వేసి మిక్సీ పట్టుకోవాలి. మరొక బౌల్లో వీడియో సైజ్ కప్ గోధుమపిండి, అర టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి ముందుగా గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ పేస్టును వేసి చపాతి పిండిలాగా కలుపుకోవాలి.
కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పూరి అప్పలాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేడి అయ్యాక ఈ అప్పలను ఫ్రై చేసుకోవాలి. ఇందులో అల్లం సోంప్ వేసాం కాబట్టి దీనికి చెట్నీ అవసరం లేదు. డైరెక్ట్ గా కూడా తినవచ్చు. లేదంటే పెరుగు చట్నీతో తిన్న ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ బీట్రూట్ పూరి చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. కాబట్టి పిల్లలు తినగలిగేలా ఈ బీట్రూట్ పూరిని ఇలా చేయండి. బీట్రూట్ పూరిని ఒక్కసారి తింటే మళ్లీమళ్లీ తినాలి అనిపిస్తుంది.