#image_title
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే ఆహారమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా చక్కెర పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, వేయించిన పదార్థాలు పొట్ట చుట్టూ కొవ్వును పెంచుతున్నాయని చెబుతున్నారు.
#image_title
వీటి వల్లనే..
చక్కెర పానీయాలు
సోడా, ఎనర్జీ డ్రింక్స్ వంటి పానీయాలు ఇన్సులిన్ స్థాయిలను పెంచి కొవ్వును నిల్వ చేస్తాయి. వీటిలో పోషకాలు లేకపోవడం వల్ల ఉబ్బరం, బరువు పెరుగుదల జరుగుతుంది.
శుద్ధి చేసిన ధాన్యాలు
తెల్ల రొట్టె, పాస్తా వంటి వాటిలో ఫైబర్ తక్కువగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఆకలిని పెంచి ఎక్కువ ఆహారం తినేలా చేస్తాయి.
వేయించిన ఆహారాలు
బజ్జీలు, చిప్స్, బోండాలు వంటి వాటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి పొట్ట చుట్టూ కొవ్వుతో పాటు వాపుకు కూడా దారితీస్తాయి.
ఆల్కహాల్
ఆల్కహాల్ శరీర జీవక్రియను మందగిస్తుంది. అధిక కేలరీలు ఇచ్చే ఇది ఆకలిని మరింత ప్రేరేపిస్తుంది.
ప్రాసెస్ చేసిన మాంసాలు
సాసేజ్‌లు, బేకన్‌లలో సోడియం, సంతృప్త కొవ్వు అధికం. ఇవి పొట్ట చుట్టూ కొవ్వుతో పాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.
ప్యాక్ చేసిన ఆహారాలు
కుకీలు, క్రాకర్లు, పేస్ట్రీలు వంటి వాటిలో చక్కెర, హైడ్రోజనేటెడ్ నూనెలు అధికంగా ఉండి బరువు పెరగడానికి కారణమవుతాయి.
నిపుణుల సూచన ప్రకారం, బరువు తగ్గాలనుకునే వారు వ్యాయామంతో పాటు ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యం. ఈ ఆహారాలను దూరంగా ఉంచడం ద్వారా బెల్లీ ఫ్యాట్ తగ్గించడం సులభం అవుతుంది.
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
Facial Fact | వయసు పెరిగేకొద్దీ ముఖంపై కొవ్వు పెరగడం సహజం. ఈ సమస్య కారణంగా చాలా మందికి డబుల్…
Coriander | వంటకాలకు రుచి, సువాసనను అందించే కొత్తిమీర (Coriander) ప్రతి వంటగదిలో తప్పనిసరి పదార్థం. తాజా ఆకులు, ఎండిన గింజలు,…
Devi Navaratri 2025 | నవరాత్రి పండుగను దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజుల ఉపవాసంలో భక్తులు…
Xiaomi 14 Civi Price | ఈ ఫెస్టివల్ సీజన్లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నవారికి గుడ్ న్యూస్. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్…
This website uses cookies.