Best 5G Mobiles :5 జీ ఫోన్ అనేది సామాన్యుడికి అందని ద్రాక్షగానే మారింది. మొబైల్ విడి భాగాలను ఉత్పత్తి చేసే కంపెనీలు తక్కువ ధరకే 5జీ మొబైల్స్ అందంచే ప్రయత్నాలు చేస్తున్నాయి. త్వరలో భారత్ లో 5జీ మొబైల్ నెట్ వర్క్ లాంచ్ కానుంది. ఈ క్రమంలో 5జీ స్మార్ట్ ఫోన్లు తీసుకోవడం బెటర్. ఆ విధంగా వచ్చే మూడు నాలుగేళ్లు మీరు మీ ఫోన్లు యూజ్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో భారత్ లో రూ.20వేలలోపు దొరికే బెస్ట్ 5జీ ఫోన్లు ఏంటో తెలుసుకుందాం.రియల్‌మీ , షియోమీ, మోటోరోలా సహా అన్ని సంస్థలు ఈ రేంజ్‌లో 5జీ ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మంది వినియోగదారులు కూడా 5జీ మొబైళ్లు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో ప్రస్తుతం స్పెసిఫికేషన్ల పరంగా రూ.20వేలలోపు బెస్ట్ 5జీ మొబైళ్లు ఇవే.
షియోమీ నుంచి వచ్చిన రెడ్‌మీ నోట్ 10టీ 5జీ ఫోన్ మీడియాటెక్ డైమంసిటీ 700 ప్రాసెసర్‌తో నడుస్తోంది.అలాగే 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ డాట్ డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంది.అలాగే ఈ ఫోన్ వెనుక మూడు కెమెరాలు ఉన్నాయి. అలాగే 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ఉన్న రెడ్‌మీ నోట్ 10టీ 5జీ ధర ప్రస్తుతం రూ.14,999గా ఉంది. మీడియాటెక్ డైమంసిటీ 810 5జీ ప్రాసెసర్, 6.5 ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేతో రియల్‌మీ 8ఎస్ 5జీ మొబైల్ వస్తోంది. ఈ మొబైల్ వెనుక 64MP+2MP+2MP కెమెరాలు, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ఉన్న రియల్‌మీ 8ఎస్ 5జీ మొబైల్ ధర ప్రస్తుతం రూ.17,999గా ఉండగా.. 8జీబీ ర్యామ్ వేరియంట్ రేట్ రూ.19,999గా ఉంది.
స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 6.4 ఇంచుల అమోలెడ్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో మోటో జీ71 5జీ మొబైల్ ఉంది. వెనుక 50MP + 8MP + 2MP కెమెరాలు ఉండగా.. 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఈ మొబైల్ 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. ప్రస్తుతం మోటో జీ71 5జీ ధర రూ.18,999గా ఉంది.మీడియాటెక్ డైమంసిటీ 800యూ 5జీ ప్రాసెసర్, 120హెట్జ్ రిఫ్రెష్ రేట్‍తో కూడిన 6.5 ఇంచుల ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ రియల్‌మీ నార్జో 30 ప్రో 5జీ మొబైల్‌లో ఉన్నాయి. 48MP + 8MP + 2MP వెనుక కెమెరాలు, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. అలాగే 30 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 6జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజీ ఉన్న నార్జో 30 ప్రో 5జీ మొబైల్ ధర ప్రస్తుతం రూ.16,999గా ఉంది.
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
This website uses cookies.