narayana fire on nagarjuna
Nagarjuna : సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సమాజంలో జరిగే పలు విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. బిగ్ బాస్‌పై ఆయన పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేసారు. షో తో పాటుగా హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున పైన ఆయన తీవ్ర వ్యాఖ్యలతో చెలరేగారు. బిగ్ బాస్ షోను వెంటనే నిలిపివేయాలని కూడా డిమాండ్ చేసారు. ఈ షో పేరుతో వేల కోట్ల వ్యాపారం జరుగుతోందని విమర్శించారు. షో చూస్తుంటే కావాలని కోట్లాటలు..అనైతిక విధానాలతో షో కొనసాగుతోందని మండిపడ్డారు.ఈ షోకి ప్రభుత్వాలు ఎలా అనుమతులు ఇస్తున్నాయంటూ కూడా గతంలో ఆయన మండిపడ్డారు.
తాజాగా నారాయణ బిగ్ బాస్ షోపై తనదైన కామెంట్స్ చేస్తూ వార్తలలోకి ఎక్కారు. తాజాగా సిపిఐ నారాయణ ఓ ఇంటర్వ్యూ లో బిగ్ బాస్ పై, నాగార్జునపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ అమ్మాయి తో డేటింగ్ చేస్తావు…. ఏ అమ్మాయిని ముద్దుపెట్టుకుంటావు… ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు అంటూ నాగార్జున ప్రశ్నలు వేస్తారు. అనేదే బిగ్ బాస్ షోనా…. నాగార్జున ఇంట్లో కూడా ఆడ వాళ్ళు ఉన్నారు కదా అంటూ కామెంట్ చేశాడు.తనకు నాగార్జున అంటే కోపం కాదని అసహ్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కమ్యూనిస్టు నాయకుడిగా ఎదిగి ఇలా తయారయ్యారేంటీ?
narayana fire on nagarjuna
అని ఆర్కే అడిగిన ప్రశ్నకు `ఇస్త్రీ బట్టలు వేసుకోకూడదు.. తెగిపోయిన చెప్పులు వేసుకోవాలి. గడ్డం పెంచాలి.. అప్పుడు వాడు నిజమైన కయ్యూనిస్టు అంటారు. కానీ అది భ్రమ. చినజీయర్ స్వామి మొదలుకుని రకరకాల వాళ్లు కూడా మాకూ కమ్యూనిస్టు భావాలున్నాయని చెప్పేవారున్నారని బదులిచ్చారు సీపీఐ నారాయణ. అసలు కమ్యూనిస్టులు అంటే ఇప్పటి తరానికి ఎవరు అనే పరిస్థితి వచ్చింది. అయితే అసలు సిసలైన కమ్యునిస్టులెవరు..? వాళ్లు ఎలా ఉండాలి..? అనే విషయాలు మరెన్నో ఆసక్తికరమైన విషయాలు సీపీఐ నేత నారాయణ ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో పంచుకున్నారు.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.