Constipation | మలబద్దకం సమస్య? .. ఈ ఫుడ్స్‌తో మలవిసర్జన మెరుగుపరుచుకోండి
Constipation | నేటి బిజీ లైఫ్‌లో సరిగ్గా తినకపోవడం, తిన్నా సరైన ఆహారం అరగకపోవడం వంటి కారణాల వల్ల మలబద్దకం అనేది కామన్ సమస్యగా మారింది. కడుపు భారంగా, తిమ్మిరిగి, నొప్పిగా ఉండటం ఫిజికల్‌గా మాత్రమే కాక మెంటల్‌గా కూడా ఇబ్బంది కలిగిస్తుంది. దీన్ని తగ్గించాలంటే డైట్‌ను హెల్తీగా మార్చడం అత్యంత అవసరం.
#image_title
మలబద్దకం నివారణకు ఉపయోగకరమైన ఫుడ్స్:
కివి & బొప్పాయి – కివిలో ఫైబర్, ఆక్టినిడిన్ ఎంజైమ్స్ ఉంటాయి, ఇవి పేగు కదలికలను మెరుగుపరుస్తాయి. బొప్పాయి లోని పపైన్ ఎంజైమ్ జీర్ణక్రియకు సహకరించి కడుపుని క్లీన్ చేస్తుంది.
ప్రూనే – సార్బిటాల్, ఫైబర్స్ కలిగిన ప్రూనే పెద్ద ప్రేగును క్లీన్ చేస్తూ మలాన్ని మృదువుగా చేస్తుంది. రోజూ కొన్ని ప్రూనే పండ్లు తీసుకుంటే మలబద్దకం సమస్య తగ్గుతుంది.
అవిసెలు & చియా గింజలు – అవిసెల్లో కరిగే, కరగని ఫైబర్స్ ఉంటాయి, ఇవి మలాన్ని సాఫ్ట్ చేస్తాయి. చియా గింజలను నానబెట్టడం వల్ల అవి విస్తరించి మలవిసర్జనలో సహకరిస్తాయి. వీటిని ఓట్స్ లేదా సలాడ్‌లలో చేర్చి తీసుకోవచ్చు.
ఓట్స్ & పప్పులు – ఓట్స్‌లోని బీటా గ్లూకాన్ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పప్పుల్లోనూ ఫైబర్, ప్రోటీన్లు ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా ప్రేగు కదలికలు బాగు అవుతాయి.
పాలకూర – మెగ్నీషియం, ఫైబర్ సమృద్ధిగా ఉండే పాలకూర పేగుల కదలికను చురుగ్గా చేస్తుంది. నేరుగా వండుకుని తినవచ్చు లేదా పప్పులో కలిపి తీసుకోవచ్చు.
సరైన ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చడం ద్వారా మలబద్దకం సహజంగా తగ్గి కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మార్గాలు ఫిజికల్, మెంటల్ రెండింటికీ ఉపశమనం కలిగిస్తాయి