Health Foods : వెండి,బంగారం కన్నా ఖరీదైన ఈ రెండు ఫుడ్స్… ఆరోగ్యానికి అదుర్స్…?
ప్రధానాంశాలు:
Health Foods : వెండి,బంగారం కన్నా ఖరీదైన ఈ రెండు ఫుడ్స్... ఆరోగ్యానికి అదుర్స్...?
Health Foods : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యంగా healthy foods ఉంటే ఐశ్వర్యం, ఆనందం అక్కడ ఉంటుంది. ఆరోగ్యం కాపాడుకోవాలంటే శారీరక శ్రమ ఎంత అవసరమో… తీసుకునే ఆహారం పట్ల కూడా అంతే శ్రద్ధ వహించాలి. ఆరోగ్యకరమైన ఆహారంను తీసుకుంటే ఆరోగ్యం రేట్టింపువుతుంది.. కొన్ని ఆహారాలు చాలా ఖరీదైనవి గా ఉంటాయి. దానిని ప్రజలు కరిధైనవి అని దూరం పెడతారు. కానీ వాటిలో ఉన్న పోషక విలువలు తెలిస్తే ఎంత ఖరీధైనా సరే వాటిని తప్పక భుజిస్తారు. అయితే ప్రస్తుత కాలంలో బంగారం వెండి ధరలు ఆకాశానికి నిచ్చెనలు వెస్తున్న మనందరికీ తెలిసిందే. అయితే, ఈ ధరలతో సమానంగా ధరలు పలికే ఖరీదైన ఆహారాలు రెండు ఉన్నాయి. అవి మీకు తెలుసా… ఈ ఆహారాల ధరలు సామాన్యులకు చాలా కష్టం తరంగా ఉంటాయి. వీటిని చాలా అరుదుగా సేకరిస్తూ ఉంటారు. వీటిని సామాన్యులు పొందాలంటే వారికి అందని ద్రాక్షారా మారుతాయి. వీటిలో పోషక, ఔషధ గుణాలు బోలెడు.
Health Foods : వెండి,బంగారం కన్నా ఖరీదైన ఈ రెండు ఫుడ్స్… ఆరోగ్యానికి అదుర్స్…?
బంగారం, వెండి కొనాలంటే ప్రజలు వాటి ధరలను చూసి హడలెత్తుతున్నారు. అలాగే వీటితో సమానంగా సరితూగే ఖరీదైన రేట్ లో ఈ ఆహారాలు లభ్యమవుతున్నాయి. ఈ పదార్థాలను కేవలం రుచి కోసమే కాదు,ఇందులో అరుదైన ఔషధ గుణాలు,వాటిని సేకరించే విధానంలో, ఉత్పత్తి చేసే విధానం కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ అరుదైన పోషక విలువలు కలిగిన ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం…
Health Foods మొదటి ఆహారం
అరుదైన అత్యంత ఖరీదైన ఆహారంలో ఒకటైనది కుంకుమపువ్వు. ఇది ఎక్కువగా కాశ్మీర్ వంటి ప్రాంతాలలో ఎక్కువగా లభ్యమవుతుంది. ఇది కాశ్మీర్ లోనే ఎక్కువగా పండుతుంది.దీనిని రెడ్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. దీని ధర,విలువ బంగారంతో సమానంగా పోలుస్తారు. సాధారణంగా ఒక కిలో కుంకుమ పువ్వుని సేకరించడానికి దాదాపు..1,50,000 క్రోకస్ పువ్వులు అవసరమవుతాయి. ఈ కుంకుమ పువ్వుని సేకరించడానికి ఈ పువ్వుల నుంచి రేకులను సేకరించే ప్రక్రియ అత్యంత శ్రమతో కూడుకొని ఉంటుంది.ఈ కుంకుమపువ్వును తయారు చేసే ప్రక్రియలో ప్రతి పువ్వు నుంచి కేవలం మూడు సన్నని సున్నితమైన రేకులను మాత్రమే చేత్తో చాలా జాగ్రత్తగా,నైపుణ్యంగా తీయాలి. కుంకుమ పువ్వును తయారు చేసే ప్రక్రియలు కష్టమైన ప్రక్రియ ఇంకా, అధిక శ్రమ కాలంగానే మార్కెట్లో ఒక కిలో స్వచ్ఛమైన కుంకుమ పువ్వు ధర సుమారు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. దీని అద్భుతమైన సువాసన అటుపై భారతీయ వంటకాలలో, సంప్రదాయాలు వైద్యంలో దీనికి ఉన్న ఎన్నో ఔషధ గుణాలు దీనికి అంతటి విలువను, డిమాండ్ ను తెచ్చిపెట్టాయి. చర్మ సౌందర్యానికి, ఇంకా ఆరోగ్యం వంటివి కూడా అనేక ప్రయోజనాలను ఈ కుంకుమపువ్వు అందిస్తుంది. కాపరివాళ్ళు అత్యంత ఖరీదైన వాటితో ఇది ఒకటి.
ఇక రెండవ ఖరీదైన ఆహారం : ఈ ఆహారము కేవలం హిమాలయ పర్వతాలలో దొరికే గుచ్చి పుట్టగొడుగులు.ఇవి ఎక్కడపడితే అక్కడ లేదా తోటల్లో వ్యవసాయ క్షేత్రాలలో పండించే పుట్టగొడుగులు కావు. ఈ గుచ్చి పుట్టగొడుగులు కేవలం హిమాలయాలలో, మంచు కరిగినప్పుడు సహజంగా మొలుస్తాయి.వీటిని సేకరించే విధానం కూడా సాహసంతో కూడి ఉంటుంది కాబట్టి వీటికి ధర ఎక్కువ. సేకరించే విధానం చాలా కఠినమైనది. అలాగే అత్యంత అరుదైనవి కూడా. వీటిని అడవిలో ప్రత్యేకంగా వీటిని వెతికి పట్టుకోవడం ఎంత కష్టమో. కాబట్టే వీటిని అత్యంత వరుదైన ఖరీదైనవిగా మార్కెట్లలో వీటిని విపరీతమైన డిమాండ్ పెరిగింది. కిలో గుచ్చి పుట్టగొడుగులు ధర సుమారు 30, 000 నుంచి 40,000 వరకు పలుకుతుంది. వీటిని పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో వంటకాలలో వాడతారు. వాటి ప్రత్యేకమైన రుచి, ఆరోగ్యం పట్ల అవి అందించే ప్రయోజనాలు, అరుదైన లభ్యత కారణంగా, ఇవి అత్యంత ఖరీదైన ఆహారలో ఒకటిగా నిలిచిపోయాయి…