Bharat Rice : తాజాగా భారత దేశంలో కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన బియ్యాన్ని సబ్సిడీపై కేవలం 29 రూపాయలకే అందించడం జరుగుతుంది. అయితే ఇంత సరసమైన ధరతో సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఈ బియ్యాన్ని తీసుకురావడంతో ఈ బియ్యానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ బియ్యాన్ని ఆన్లైన్ లో ఎలా కొనుగోలు చేయాలి అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇక పూర్తిగా వివరాల్లోకి వెళితే. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ , అలాగే నేషనల్ కో-ఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనే రెండు సహకార సంఘాలు 5 లక్షల టన్నుల బియ్యాన్ని సరఫరా చేసేందుకు చూస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఏజెన్సీలో ఈ బియ్యాన్ని ఐదు కిలోలు మరియు 10 కిలోల చొప్పున ప్యాక్ చేస్తున్నాయి. ఇక వాటిని అవుట్ లెట్స్ ద్వారా భారత్ బ్రాండ్ తో రిటైల్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు అదనంగా భారత రైస్ ను ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ద్వారా కూడా విక్రయించేందుకు ప్రణాళికల సిద్ధం చేస్తున్నాయి. ఇక దీనికి సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో భారత్ రైస్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగల వినియోగదారులందరూ అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ లను ఆశ్రయిస్తున్నారు.
అయితే నిజానికి ప్రస్తుతం భారత్ రైస్ ను ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లో అమ్మకానికి జాబితా సిద్ధం చేయలేదని చెప్పాలి. అయితే ఇది జియో మార్ట్ వెబ్ సైట్ లో జాబితా చేయబడినప్పటికీ అమ్మకానికి ఇంకా ప్రారంభం మాత్రం చేయలేదు. బెంగళూరు ముంబై చెన్నై ఢిల్లీ మరియు కోల్ కత్తా వంటి వివిధ పిన్ కోడ్ ప్రయత్నాలు చేసినప్పటికీ ఆర్డర్ ఇవ్వడానికి ప్రయత్నించే వినియోగదారులు ఉత్పత్తి లభ్యతను సూచిస్తూ నోటిఫికేషన్లను అందుకుంటున్నారు. అలాగే ఎన్.ఏ.ఎఫ్.ఈ.డి అధికారిక వెబ్ సైట్ లో కూడా ఆన్ లైన్ విక్రయాలు ఇంకా ప్రారంభం కాలేదు. మరి ఈ భారత్ రైస్ ఆన్లైన్ ద్వారా విక్రయించేందుకు సన్నహాలు జరుగుతున్నప్పటికీ ఎప్పుడు అందుబాటులో ఉంటాయి అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.