Bharat Rice : గుడ్‌న్యూస్‌.. ఆన్ లైన్ లో భారత రైస్ విక్రయం.. ఎప్పుడంటే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bharat Rice : గుడ్‌న్యూస్‌.. ఆన్ లైన్ లో భారత రైస్ విక్రయం.. ఎప్పుడంటే…!

 Authored By aruna | The Telugu News | Updated on :13 February 2024,8:30 pm

ప్రధానాంశాలు:

  •  Bharat Rice : ఆన్ లైన్ లో భారత రైస్ విక్రయం..ఎప్పుడంటే...!

Bharat Rice :  తాజాగా భారత దేశంలో కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన బియ్యాన్ని సబ్సిడీపై కేవలం 29 రూపాయలకే అందించడం జరుగుతుంది. అయితే ఇంత సరసమైన ధరతో సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఈ బియ్యాన్ని తీసుకురావడంతో ఈ బియ్యానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ బియ్యాన్ని ఆన్లైన్ లో ఎలా కొనుగోలు చేయాలి అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇక పూర్తిగా వివరాల్లోకి వెళితే. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ , అలాగే నేషనల్ కో-ఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనే రెండు సహకార సంఘాలు 5 లక్షల టన్నుల బియ్యాన్ని సరఫరా చేసేందుకు చూస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఏజెన్సీలో ఈ బియ్యాన్ని ఐదు కిలోలు మరియు 10 కిలోల చొప్పున ప్యాక్ చేస్తున్నాయి. ఇక వాటిని అవుట్ లెట్స్ ద్వారా భారత్ బ్రాండ్ తో రిటైల్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు అదనంగా భారత రైస్ ను ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ద్వారా కూడా విక్రయించేందుకు ప్రణాళికల సిద్ధం చేస్తున్నాయి. ఇక దీనికి సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో భారత్ రైస్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగల వినియోగదారులందరూ అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ లను ఆశ్రయిస్తున్నారు.

అయితే నిజానికి ప్రస్తుతం భారత్ రైస్ ను ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లో అమ్మకానికి జాబితా సిద్ధం చేయలేదని చెప్పాలి. అయితే ఇది జియో మార్ట్ వెబ్ సైట్ లో జాబితా చేయబడినప్పటికీ అమ్మకానికి ఇంకా ప్రారంభం మాత్రం చేయలేదు. బెంగళూరు ముంబై చెన్నై ఢిల్లీ మరియు కోల్ కత్తా వంటి వివిధ పిన్ కోడ్ ప్రయత్నాలు చేసినప్పటికీ ఆర్డర్ ఇవ్వడానికి ప్రయత్నించే వినియోగదారులు ఉత్పత్తి లభ్యతను సూచిస్తూ నోటిఫికేషన్లను అందుకుంటున్నారు. అలాగే ఎన్.ఏ.ఎఫ్.ఈ.డి అధికారిక వెబ్ సైట్ లో కూడా ఆన్ లైన్ విక్రయాలు ఇంకా ప్రారంభం కాలేదు. మరి ఈ భారత్ రైస్ ఆన్లైన్ ద్వారా విక్రయించేందుకు సన్నహాలు జరుగుతున్నప్పటికీ ఎప్పుడు అందుబాటులో ఉంటాయి అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది