Bhavya laxmi Scheme : దేశంలో ఆడపిల్లల సంఖ్య పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం పలు రకాల ప్రోత్సాహకాల కార్యక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే చాలామంది ఆడపిల్ల పుడితే కుటుంబానికి భారం అని అనుకుంటున్నా నేపద్యంలో అలాంటి ఆలోచనలు తరిమికొట్టేలా పలు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆడపిల్ల పుట్టిన వెంటనే ఏదో ఒక పథకం ద్వారా ఆర్థిక భరోసాని అందిస్తున్నారు. ఇక ఈ పథకం పేరు భాగ్యలక్ష్మి. ఇక ఈ పథకం వలన ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎంతో మేలు జరుగుతుంది అంటున్నారు. అయితే ఆడపిల్ల పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పథకం ఇది. ఆడపిల్లల బృణ హత్యలను అరికట్టే దిశగా ఈ పథకాన్ని అమలు చేసినట్లు సమాచారం.
అయితే ఈ భాగ్యలక్ష్మి అనే పథకాన్ని కర్ణాటక ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టడం జరిగింది. ఇక ఈ పథకం ఆడపిల్లల భవిష్యత్తుకు ఎంతగానో సహాయపడుతుందని తెలియజేస్తున్నారు. అలాగే 21 ఎళ్లు నిండిన ఆడబిడ్డకు భాగ్యలక్ష్మి పథకం ద్వారా దాదాపు రెండు లక్షల రూపాయలు అందిస్తారట. ఈ నగదు మొత్తం ఆడపిల్ల చదువు పెళ్లి ఇతరత్ర ఖర్చులకు సహాయపడుతుందని అధికారులు తెలియజేస్తున్నారు. అయితే దీని ద్వారా ప్రభుత్వం నుండి వచ్చే మొత్తం తో పాటు తల్లిదండ్రులు వాయిదాల రూపంలో చెల్లించే మొత్తం రెండింటికి కొంతకాలం పూర్తయిన తర్వాత వడ్డీ కలిపి ఆడపిల్లలకు అందజేస్తారు.
అయితే ఈ పథకానికి అర్హులు అయిన వారు రెండు లక్షల కంటే తక్కువ వార్షికాదాయం కలిగి ఉండాలి. అప్పుడే ఈ పథకానికి అర్హులవుతారు. అలాగే ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందట. ఇక ఈ పథకంలో చేరాలి అనుకునే వారు ముందుగా అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ పథకం కోసం ఆడపిల్లల జనన ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, కుల దృవీకరణ పత్రం, ఫోన్ నెంబర్ ,బ్యాంక్ ఖాతా నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే 31 మార్చి 2006 తర్వాత పుట్టిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులని గమనించాలి. ఇక ఈ పథకంలో మొదటి ఆడపిల్ల పుట్టినప్పుడు రూ.19,300 డిపాజిట్ చేయబడుతుంది. ఇక ఆ పిల్లకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత రూ.1,00,097 రూపాయలు ఇవ్వబడుతుంది. అదేవిధంగా రెండో ఆడపిల్ల పుట్టినప్పుడు రూ.18,350 డిపాజిట్ చేస్తారు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత రెండవ ఆడపిల్లకు రూ.1,00052 ఇవ్వబడుతుంది.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.